
డిసెంబర్‌లో ద్రౌపది–2
తమిళసినిమా: నటుడు రిచర్డ్‌రిషి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ద్రౌపది–2 . దీనికి మోహన్ జి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు రూపొందిన ద్రౌపది చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా దానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ద్రౌపది–2. జీఎం ఫిలిం కార్పొరేషన్ తనతో కలిసి నేతాజీ ప్రొడక్షన్స్ అధినేత చోళచక్రవర్తి నిర్మిస్తున్న చిత్రం ఇది. చరిత్ర, వారసత్వం, శక్తి, నీతి వంటి ప్రధానాంశాలతో రూపొందుతున్న కథా చిత్రం ద్రౌపది–2 అని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. నటి రక్షణ ఇందూసూధన్ నాయికగా నటిస్తున్న ఇందులో నట్టి, వైజీ.మహేంద్రన్, శరవణ సుబ్బయ్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని, తాజాగా రెండవ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిచర్డ్‌రిషి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసినట్లు చెప్పారు. రిచర్డ్‌రిషికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ఆయన గెటప్‌నకు మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్ర వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచినట్లు, తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న ద్రౌపది–2 చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నాయి. కాగా ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని, ఫిలిప్ ఆర్.సుందర్ చాయా గ్రహణం, మాటలను పద్మచంద్రశేఖర్, మోహన్.జీ అందించినట్లు చెప్పారు.
ద్రౌపది చిత్ర సెకండ్ పోస్టర్