క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Oct 23 2025 6:14 AM | Updated on Oct 23 2025 6:14 AM

క్లుప

క్లుప్తంగా

పాము కాటుకు

ప్రభుత్వ ఉద్యోగి మృతి

పళ్లిపట్టు: పాము కాటుకి ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పొదటూరుపేట పోలీసుల కథనం మేరకు.. పొదటూరుపేటలోని నల్లతన్నీరు కులం వీధికి చెందిన గణేశన్‌(55) పొదటూరుపేట ప్రభుత్వ బాలికల మహాన్నత పాఠశాలలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించేవారు. అతను బుధవారం అతని ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. అక్కడే ఉన్న పామును చూసిన కుమారుడు మోహన్‌రాజ్‌ వెంటనే పామును కొట్టి గణేశన్‌కు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు గణేశన్‌ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం మేరకు పోలీసులు మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌ నుంచి పడి బాలుడు..

అన్నానగర్‌: బైక్‌కు కుక్క అడ్డంగా రావడంతో ఓ బాలుడు మృతిచెందాడు. తిరువేర్కాడ్‌ సమీపం సుందరచోళపురంలోని చోళ గార్డెన్‌ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్‌. ఇతను ఒక ప్రైవేట్‌ కంపెనీలో మేనేజర్‌. ఇతని కుమా రుడు దర్శన్‌ (16) ప్లస్‌వన్‌ చదువుతున్నాడు. మంగళవారం అతను స్నేహితులతో కలిసి బైక్‌లో బయటకు వెళ్లాడు. తిరిగి లింగంనగర్‌లోని ఆయిల్సేరి మార్గంలో ఇంటికి వస్తుండగా హఠాత్తుగా కుక్క బైక్‌కు అడ్డంగా రావడంతో అదుపుతప్పి దర్శన్‌ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసి సంఘటన స్థలానికి వెళ్లిన ఆవడి పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రూ.40 లక్షల మోసం

–ముగ్గురిపై కేసు నమోదు

కొరుక్కుపేట: ప్లాస్టిక్‌ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభం ఇస్తామని నమ్మించి వృద్ధుడి వద్ద రూ.40 లక్షలు మోసం చేసిన మహిళ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పద్మనాభన్‌ (66) చైన్నె కొండితోప్‌ కన్నయ్య నాయుడు వీధి నివాసి. ఇతను ఒక ప్లాస్టిక్‌ కంపెనీ నడుపుతున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో కంపెనీని మూసివేసి కొండిటాప్‌లో గణేశ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితిలో తరచూ ఆలయానికి వెళుతున్న గీత పద్మనాభన్‌తో పరిచయం ఏర్పడింది. ప్లాస్టిక్‌ కంపెనీలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించడంతో పద్మనాభన్‌ తన ఆస్తులను తనఖా పెట్టి 2016లో గీత, రమేష్‌, శ్రీనివాసులుకు రూ. 40 లక్షలు ఇచ్చాడు. తర్వాత, ముగ్గురూ వ్యాపారం గురించి పద్మనాభన్‌న్‌కు తెలియజేయలేదు. అనుమానం వచ్చిన పద్మనాభన్‌ తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెట్టాడు. వారు తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో పద్మనాభన్‌ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసుకు సంబంధించి క్రిమినల్‌ కోర్టులో కూడా పిటిషన్‌ వేశారు. కోర్టు ఆదేశించండంతో గీత, రమేష్‌, శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు.

పిడుగు పడి

జల్లికట్టు ఎద్దులు మృతి

అన్నానగర్‌: పిడుగు పడి రెండు జల్లికట్టు ఎద్దులు మృతిచెందాయి. తిరుచ్చి జిల్లాలోని సమయపురం సమీపం పురతక్కుడి ఓల్డ్‌ పోస్టాఫీస్‌ వీధికి చెందిన సెల్వం. సెల్వం తన ఇంట్లో రెండు జల్లికట్టు ఎద్దులు ఉన్నాయి. మంగళవారం సమయపురం, పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ స్థితిలో, సెల్వం జల్లికట్టు ఎద్దులను ఇంటి సమీపంలోని కొబ్బరి చెట్టుకు కట్టేశాడు. ఆ సమయంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. పిడుగుపాటుకు కట్టి ఉన్న రెండు జల్లికట్టు ఎద్దులు అక్కడికక్కడే మృతిచెందాయి. బుధవారం ఎద్దులను ఖననం చేశారు.

యువకుడిపై పోక్సో కేసు

తిరువొత్తియూరు: విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె కొడుంగయూర్‌ ప్రాంతానికి చెందిన మహిళ(35). ఈమె భర్త ఏడాది క్రితం మృతిచెందాడు. వీరి 18 ఏళ్ల కుమార్తె ప్రైవేట్‌ కళాశాలలో చదువుతోంది. బుధవారం ఆ విద్యార్థిని సమీపంలో ఉన్న స్నేహితురాలి ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, ఓ వ్యక్తి అడ్డుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థిని కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి రావడంతో యువకుడు పారిపోతుండగా స్థానికులు పట్టుకుని యువకుడిని కొడుంగయ్యూర్‌ పోలీస్‌స్టేషన్‌న్‌లో అప్పగించారు. విచారణలో అతను కొడుంగయ్యూర్‌ కణ్ణదాసన్‌నగర్‌కు చెందిన విక్రమ్‌ (22) అని, ప్రైవేట్‌ కొరియర్‌ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. అతడిని ఎంకేబీ నగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌న్‌లో అప్పగించారు. విక్రమ్‌ను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement