26.3 అడుగులు చేరుకున్న అరణియార్ నీటి మట్టం
నాగలాపురం: పిచ్చాటూరు మండల పరిదిలోని అరణియార్ రిజర్వాయర్‌లో నీట మట్టం 26.3 అడుగులకు చేరుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాయంలో నీటి నిల్వ పెరిగింది. క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో కొనసాగుతున్నందున రాబోయే రోజుల్లో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అరణియార్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయానికి 301 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. ఫ్లడ్‌గేటు మూసి వేసి ఉండడంతో ఔట్‌ఫ్లో లేదని అధికారులు వెల్లడించారు. రేపు భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద గట్టి నిఘా ఉంచామని అన్నారు. ఏఈ స్థాయి అధికారులను 24 గంటల పాటు ప్రాజెక్టు గేటు వద్ద ఉండి పర్యవేక్షించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. గ్రామస్తులు, రైతులు రాబోయే సాగు సీజన్‌కు సరిపడేంత నీరు అరణియార్‌లో నిల ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.


