గరుడ వాహనంపై నృసింహుడి చిద్విలాసం
రాపూరు: మండలంలోని పెంచలకోనలో పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి బుధవారం రాత్రి బంగారు గరుడవాహనంపై చిద్విలాసం చిందించారు. శ్రీవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం బుధవారం రావడంతో చందనంతో అలంకరించారు. నిత్య కై ంకర్యాలతోపాటు అభిషేకాలు, శాంతి హోమం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. రాత్రి శ్రీవారికి అత్యంత ప్రియమైన బంగారు గరుడ వాహనంపై శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి వివిధరకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణ నడుమ పెంచలకోనలో దేవస్థాన కార్యాలయం వరకు క్షేత్రోత్సవం నిర్వహించారు. స్వామివారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.


