ఇంటింటా మిన్నంటిన సంబరాలు
తిరుత్తణి: తిరుత్తణిలో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. సోమవారం దీపావళి సందర్భంగా తిరుత్తణిలో సందడి నెలకొంది. బంధువులు, స్నేహితులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు బాణసంచా కాల్చారు. మహిళలు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించారు.
తిరువళ్లూరులో..
తిరువళ్లూరు: దీపావళి పండుగను తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఉదయం నుంచే పట్టణంలో టపాసుల సందడి నెలకొంది. దయం ప్రారంభమైన టపాసుల మోత రాత్రి వరకు సాగింది. మార్కెట్, బజారు వీధిలో రద్దీ నెలకొంది. బాణసంచా దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.
తిరుత్తణిలో టపాసులు కాలుస్తున్న దృశ్యం
తిరువళ్లూరులో దీపావళి వేడుకలు
ఇంటింటా మిన్నంటిన సంబరాలు


