తొలి దీపావళి మూడ్‌లో కీర్తీసురేశ్
తమిళసినిమా: జీవితంలో ఎవరికై నా పెళ్లి ఒక పవిత్రమైన బంధం. అది మరువరాని మధురమైన అనుభూతి. ఇక సెలబ్రిటీస్ అయితే పెళ్లిని ఆడంబరంగా జరుపుకుంటారు. అలాంటిది నటి కీర్తీసురేశ్ మాత్రం తన పెళ్లిని అత్యంత సన్నిహితుల సమక్షంలో జరుపుకోవడం విశేషం. గత ఏడాది డిసెంబర్ నెలలో తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీని పెళ్లాడారు. వీరి వివాహం గోవాలో జరిగింది. వివాహానంతరం నటించడానికి సిద్ధమైన కీర్తీసురేశ్‌కు ఇప్పుడు కొత్త అవకాశాలు వరిస్తున్నాయి. ఇకపోతే దీపావళి అంటేనే అందరిలోనూ వెలుగులు నింపే పండుగ. సినిమా వాళ్లు దీన్ని ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేస్తుంటారు. అలా రజనీకాంత్ తన కుటుంబసభ్యులతో దీపావళి వేడుకను జరుపుకున్నారు. అదేవిధంగా త్రిష, హన్సిక పలువురు సినీ ప్రముఖులు దీపావళి వేడుకను జరుపుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ముఖ్యంగా కీర్తీసురేశ్‌కు పెళ్లి అయిన తరువాత వచ్చిన తొలి దీపావళి ఇది. ఈ పండుగను ఈ అమ్మడు తన భర్తతో కలిసి ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఇద్దరూ టపాసులు కాల్సి ఆనందాన్ని పంచుకున్నారు. స్మిమ్మింగ్‌పూల్ పక్కన కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ముచ్చట్లు చెప్పుకున్నారు. కారులో షికారు చేశారు. అలా ఆహ్లాదకరమైన ప్రదేశంలో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ జంట అలా గడిపింది ఎక్కడ అన్నది మాత్రం తెలపలేదు.


