శివాజీ అభిమానుల ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
వేలూరు: వేలూరు కర్ణన్ శివాజీ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో వేలూరు వేలపాడిలోని అనాథాశ్రమంలో దీపావళి పండుగ వేడుకలను జరుపుకున్నారు. ముందుగా ఆణికులతమ్మన్ ఆలయ ధర్మకర్త సెల్‌శివ అధ్యక్షతన మాజీ కార్పొరేటర్ పీపీ చంద్రప్రకాష్, నిర్వహకులు ఆశ్రమంలోని వృద్ధులకు, చిన్ని పిల్లలకు అన్నదానం చేయడంతో పాటు వారికి నూతన దుస్తులు అందజేసి స్వీట్లు పంచి పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం లడ్డులను అందజేశారు. అదే విధంగా వృద్ధుల వద్ద టపాకాయాలు పేల్చి దీపావళి పండుగ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ అభిమానుల సంఘం నిర్వాహకులు గంగాధరన్, భూపతి, సుందర్, మణి, రవీంద్రన్ పాల్గొన్నారు.


