
టపాకాయల విక్రయాలు ప్రారంభం
వేలూరు: వేలూరు కర్పగం సూపర్ మార్కెట్‌లో నూతన రకాల దీపావళి టపాకాయల విక్రయాన్ని కలెక్టర్ సుబ్బలక్ష్మి సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీపావళి పండుగకు కర్పగం సూపర్ మార్కెట్‌లో కొనుగోలు దారులకు అతి తక్కువ ధరతో టపాకాయలు విక్రస్తున్నట్లు తెలిపారు. రూ. 372 నుంచి రూ. 2,872 వరకు టపాకాయల బాక్సులు సిద్దంగా ఉంచినట్లు తెలిపారు. ఈ సంవత్సరం నూతనంగా కొన్ని టపాకాయలను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. వీటి ధర రూ. 200 నుంచి రూ.10 వేల వరకు ఉంటుందన్నారు. గత సంవత్సరం దీపావళి పండుగకు రూ. కోటి విలువ చేసే టపాకాయాలను విక్రయించడం జరిగిందని ఈ సంవత్సరం రూ.1.25 కోట్లు విలువ చేసే టపాకాయలను విక్రయించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. వేలూరులోనే కాకుండా జిల్లాలోని గుడియాత్తం, తిరుపత్తూరు, వాణియంబాడి, వాలాజ, రాణిపేట తదితర ప్రాంతాల్లోని కర్పగం సూపర్ మార్కెట్‌లో అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, కర్పగం సూపర్ మార్కెట్ జాయింట్ డైరెక్టర్ తిరుగుణ అయ్యప్పదురై, విక్రయ శాల జాయింట్ రిజిస్టార్ జయం, కార్పొరేషన్ మూడవ జోన్ చైర్మన్ వీనస్ నరేంద్రన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.