
మాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా చిత్రం
తమిళసినిమా: ఇంతకుముందు చిన్న చిత్రాలకు చిరునామా అయిన మాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌గా మారిందనే చెప్పారు. అలా ఇంతకుముందు మార్కో వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన షరీఫ్ మహ్మద్ తాజాగా తన క్యూబ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం కాట్టాళన్. పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో ఆంటోని వర్గీస్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సినీ వర్గాలను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చెదిరిన జుట్టు ఎరుపెక్కిన కళ్లు, రక్తంతో నిండిన ముఖం, చేతులు, నోట్లో సిగార్ తో ఆంటోని వర్గీస్ ఫొటో తక్కువైనా ఈ పోస్టర్ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. చిత్రాన్ని మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో తెలుగు నటుడు సునీల్, రాజ్‌తిరందాసులతోపాటు కబీర్ దుహాన్ సింగ్ రాబర్ బేబీ జీన్, బాలీవుడ్ నటుడు పాత్ తివారీ, మలయాళ నటుడు జగదీష్, సిద్ధిక్, హనాన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జోడి వర్గీస్, పాల్‌జార్జ్, జీరో జాకబ్ కథనాన్ని రచించిన ఈ చిత్రానికి బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని, రణదీవ్ చాయాగ్రహణం అందిస్తున్నారు.