
ఇంటర్నెట్లో హాట్ హాట్‌గా ప్రియాంక
కాట్టాళన్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్
తమిళసినిమా: కథానాయికలు వెండితెరపై అందాలను ఆరబోయడం కొత్త కాదు. అయితే శ్రుతి మించితేనే విమర్శలకు దారితీస్తుంది. కాగా ప్రస్తుతం నటి ప్రియాంకమోహన్ పరిస్థితి ఇదే. 2019లో మాతృభాషలో కథానాయకిగా పరిచయమైన కన్నడ బ్యూటీ ప్రియాంక మోహన్. ఆ వెంటనే తెలుగులో నాని గ్యాంగ్‌లీడర్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఆ తర్వాత కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ ఈమె శివకార్తికేయన్‌కు జంటగా నటించిన డాక్టర్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈమె పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలా శివకార్తికేయన్‌తో మరోసారి జంట కట్టిన డాన్ చిత్రం కూడా విజయానిచ్చింది. ఈ అమ్మడు విజయాలు అందుకుంటున్నా మార్కెట్ మాత్రం పెరగడం లేదు. ఉదాహరణకు ఇంతకుముందు తెలుగులో నాని సరసన నటించిన సరిపోదా శనివారం, ఇటీవల పవన్ కల్యాణ్‌తో జత కట్టిన ఓజి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. అయినప్పటికీ తాజాగా తెలుగులోగానీ కన్నడంలోగానీ కొత్తగా అవకాశాలు రాలేదన్నది గమనార్హం. పైగా శృంగార భరిత సన్నివేశాల్లో నటించారంటూ విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఓజి చిత్రంలో అందాలను ఆరబోసినట్లు, బెడ్ రూమ్ సన్నివేశాల్లోనూ నటించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతటితో ఆగకుండా ఈమె గ్లామరస్ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రియాంకమోహన్ కొంచెం ఘాటుగానే స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఫొటోలు తనవి కాదని, అవి ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఫొటోలని పేర్కొంది. ఇలాంటి చర్యలను ఆపేయాలని ఏఐ టెక్నాలజీని మంచి కోసం సద్వినియోగం చేసుకోవాలని ప్రియాంక హితవు పలికారు. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క తమిళ చిత్రం మాత్రమే ఉందన్నది గమనార్హం.