
హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేయాలి
వేలూరు: ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అవగాహన కలిగే విధంగా ప్రతి తాలుకాలోనూ హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు. వేలూరు కలెక్టరేట్‌లో రాష్ట్ర మైనారిటీ కమిషన్ సభ్యులు, వేలూరు జిల్లాలోని మైనారిటీ విభాగం చెందిన సభ్యులు, ప్రతినిధులు, అధికారులతో సమావేశం కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఇందులో కమిషన్ చైర్మన్ అరుణ్ మాట్లాడుతూ మైనారిటీల కోసం ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, ప్రస్తుతం ఎటువంటి పథకాలను ఎక్కడ అమలు చేశారు, ఎంత మంది లబ్ధిదారులున్నారు అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో పలు విషయాలను అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం లబ్ధిదారులకు పలు సంక్షేమ పథకాలను అందజేశారు. ఎస్పీ మయిల్‌వాగనం, ఎమ్మెల్యేలు కార్తికేయన్, అములు, మేయర్ సుజాత, మైనారిటీ శాఖలకు చెందిన అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.