
ఆరోగ్య సంరక్షణపైమారథాన్
– వెనుకబడిన పిల్లలకు రూ.4.42 కోట్ల సాయం
సాక్షి, చైన్నె : క్యాన్సర్ రోగులకు సహకారంగా, క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు మద్దతు, పేద పిల్లలకు విద్య, వైద్య సేవలు అందించే రీతిలో నిధుల సేకరణ మారథాన్ చైన్నెలో విజయవంతంగా ఆదివారం జరిగింది. ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఈ మారథాన్‌ను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అడయార్‌లోని క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు మద్దతుగా నెవిల్లే ఎండీవర్స్ ఫౌండేషన్, నేతృత్వంలో డాన్ టు డస్క్(డీ2డీ) నినాదంతో చైన్నెలో 8వ ఎడిషన్‌గా అన్నావర్సిటీ ఆవరణలో మారథాన్‌కు చర్యలు తీసుకున్నారు. సుమారు 3,500 మందికి పైగా క్రీడాకారులు, రన్నర్లు, వాకర్లు ఈ మారథాన్‌కు తరలి వచ్చారు. ఇక్కడి నుంచి ఉదయాన్నే 5 గంటలకు 25 కి.మీ, 21 కి.మీ దూరం రన్‌ను జ్యోతి ప్రజ్వలనతో ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అన్నావర్సిటీ రిజిస్టార్ డాక్టర్ జే ప్రకాష్, ఎతిరాజ్ మహిళా కళాశాల చైర్మన్ మురళీ ధరన్, అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ డాక్టర్ కల్పనా బాలకృష్ణన్, ఉపాధ్యక్షులు డాక్టర్ హేమంత్ రాజ్ తదితరులు హాజరయ్యారు. అనంతరం ఉదయం 6 గంటలకు 16 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ, 3 కి.మీ విభాగాలలో రన్ జరిగింది. దీనిని మాజీ డీజీపీ శైలేంద్రబాబు, నటుడు షంషాద్ ప్రారంభించారు. పాలీహౌస్ ఇండియా ఎండీ షబ్బీర్ యూసఫ్ బాయ్, ఉమ్మడి బంగారు జ్యువెలర్స్ ఎండీ ఉమ్మిడి జితేంద్రలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 6.20 గంటల 125 కి.మీ, 100 కి.మీ, 75 కి.మీ,50 కి.మీ, 25 కి.మీ, 10 కి.మీ సైక్లింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి టీవీఎస్ మొబిలిటీ డైరెక్టర్ శ్రీనాథ్ రాజం, జీఆర్‌టీ హోటల్స్ సీఈఓ విక్రమ్ కోట హాజరయ్యారు. అలాగే, 4 నుంచి 17 సంవత్సరాలపిల్లల కోసం కిడ్స్ రన్ ఉదయం 7.30 నుంచి నిర్వహించారు. ఎస్‌పీఏఆర్‌ఆర్‌సీ వ్యవస్థాపకుడు డాక్టర్ కన్నన్ పుగలేంది, క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ కల్పన బాలకృష్ణన్, డీ2డీ వ్యవస్థాపకుడు నెవిల్లే బిలిమోరియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా వచ్చిన రూ.4.42 కోట్లను వెనుకబడిన పిల్లలకు విద్య, వైద్య చికిత్స కోసం సేకరించి అందజేశారు.

ఆరోగ్య సంరక్షణపైమారథాన్