న్యూస్‌రీల్
– అధికారిక హోదాలో తొలి పర్యటన
సాక్షి, చైన్నె : ఉప రాష్ట్రపతిగా తొలిసారి చైన్నెకి సీపీ రాధాకృష్ణన్ రాను న్నారు. ఆయనకు బ్రహ్మరథం పట్టే ఆహ్వానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. త మిళనాడుకు చెందిన బీజేపీ నేత సీపీ రాధాకృష్ణన్ గత నెల వరకు గవర్నర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు అనూహ్యంగా రాష్ట్రపతి అయ్యే అవకాశం దక్కింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి అభ్యర్థిగా ఆయన విజయ కేతనం ఎగుర వేశారు. ఈనెల 12వ తేదీన ఉప రాష్ట్రపతిగా బా ధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలతో అధికారి కంగా తొలిసారిగా చైన్నె, కోయంబత్తూరు పర్యటనకు ఆయన సిద్ధమయ్యారు. ఇదివరకు బీజేపీ నేతగా, గవర్నర్‌గా ఇక్కడకు వచ్చి వెళ్లిన ఆయన తొలిసారిగా భారత ఉపరాష్ట్రపతి హోదాలో మా తృభూమిలో అడుగు పెట్టనున్నారు. ఈ నెల 4వ తేదీన చైన్నెకు ఆయన రానున్నారు. ఆయనకు అ ధికారిక ఆహ్వానంతోపాటు బీజేపీ నేతృత్వంలో దారి పొడవున బ్రహ్మరథం పట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 4 తేదీన చైన్నెలోనే ఆయన ఉంటా రు. ఆయనకు సత్కార వేడుకకు ఏర్పాట్లు చేసినట్టు సమాచాం. 5వ తేదీన కోయంబత్తూరు వెళ్లనున్నారు. అక్కడ కూడా ఆయనకు ఘన స్వా గతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తగ్గని బూచీలు
– మూడు చోట్ల ఉత్కంఠ
సాక్షి, చైన్నె : బాంబు బూచీల కలకలం చైన్నెలో రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా హైకోర్టు, రాజ్ భవన్, ఆర్మీ కార్యాలయాలను పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్స్ అధికారులను పరు గులు తీయించాయి. గత వారం రోజులుగా రోజుకోచోట బాంబు బూచీలు పోలీసుల్లో ఉత్కంఠ రే పుతూ వచ్చిన విషయం తెలిసిందే. బెదిరింపు కా ల్స్, ఈ మెయిల్ బెదిరింపులతో పరుగులు తీస్తు న్నారు. తాజాగా వచ్చిన ఈ మెయిల్ బెదిరింపు తో ఉదయాన్నే హైకోర్టుకు పరుగులు తీశారు. హైకోర్టు ఆవరణలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ఏ ఒక్కర్నీ లోనికి అనుమతించకుండా సో దాలు చేశారు. దీంతో ఉదయాన్నే హైకోర్టు ఆవరణలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలాగే, గిండి లోని రాజ్ భవన్‌కు వచ్చిన బెదిరింపుతో అక్కడ కూడా సోదాలు జరిగాయి. సచివాలయం ఆవరణలో ఆర్మీ కార్యాలయానికి సైతం బెదిరింపు రా వడంతో పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్‌లు పరుగులు తీశాయి. అయితే, ఈ బెదిరింపు ఇస్తున్న వారిని కనుకొనగడం సైబర్ క్రైమ్‌కు సవాలుగా మారింది. రోజుకో చోట నుంచి ఈ బెదిరింపు రా వడం, ఈమెయిల్ ఐడీలను తరచూ మారుస్తుండడంతో గుర్తించడం కషంగా ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.
కుగ్రామాలకు 4 జీ సేవలు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని కుగ్రామాలకు సైతం 4 జీ సేవలను అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం కొత్త టవర్లు ఏ ర్పాటయ్యాయి. శనివారం నుంచి సేవలకు శ్రీకా రం చుట్టనున్నారు. తమిళనాడులోని అటవీ, కు గ్రామాలలో 4 జీ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు తాము తీసుకున్న చర్యలను గురించి బీఎస్‌ఎన్‌ఎల్ మేనేజర్ పార్తీబన్ శుక్రవారం మీడియాకు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవల ను ప్రారంభించనున్నారని ప్రకటించారు. తమిళనాడులోని 620 గ్రామాలను గుర్తించి 4 జీ సేవ లు సులభం అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 222 గ్రామాలను కవర్ చేస్తూ కొత్త ట వర్లు ఏర్పాటు చేశామని, మరో 35 గ్రామాలను క వర్ చేస్తూ ఇది వరకు ఉన్న 2 జీ టవర్ల స్థాయిని పెంచామన్నారు. తమిళనాడు ప్రభుత్వం సహకారంతో 188 రెవెన్యూ గ్రామాలు, 21 అటవీ గ్రా మాలు, చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల పరిధిలోని 196 గ్రామాల్లో కొత్త 4 జీ టవర్లు సిద్ధం చేశామన్నారు.