నియోజకవర్గాల బాట | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గాల బాట

Sep 24 2025 5:39 AM | Updated on Sep 24 2025 5:39 AM

నియోజకవర్గాల బాట

నియోజకవర్గాల బాట

● ఎంపీలకు స్టాలిన్‌ ఆదేశాలు ● ఇకపై ప్రతి 15 రోజులకూ నివేదిక ఇవ్వాలని స్పష్టీకరణ

వారంలో 4 రోజులు..

సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. 2026 ఎన్నికలలో మళ్లీ గెలుపు దిశగా వ్యూహాలకు పదును పెట్టిన సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ పార్టీ పరంగా ఇప్పటికే కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఓ వైపు ప్రభుత్వ పరంగా క్షేత్ర స్థాయి పర్యటనలో బీజీ అయ్యారు. మీతో స్టాలిన్‌, స్టాలిన్‌ వైద్య శిబిరాలు అంటూ పలు కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ పరిస్థితులలో పార్లమెంట్‌ సభ్యులు, రాజ్యసభ సభ్యులను సైతం రంగంలోకి దించారు. పార్టీ పరంగా కార్యక్రమాలతో పాటుగా వారు ఎంపికై న నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే దిశగా చర్యలు చేపట్టారు.

క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా, ఎమ్మెల్యేల గెలుపు కకోసం పార్లమెంట్‌ సభ్యులు పూర్తి స్థాయిలో శ్రమించాలని, మద్దతు ఇవ్వాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేశారో దానిని తదన్నే విధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపునకు ఎంపీలు పనిచేయాలని, నిరంతరం ప్రజలోనే ఉండాలని ఆదేశించారు. ప్రజలతో మమేకం అయ్యే విధంగాఎంపీల కార్యక్రమాలు విస్తృతం కావాలని, ఇందుకు సంబంధించిన చర్యలు వేగవంతం చేయాలన్నారు. మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో పర్యటించాలని సూచించారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న రోజులు మినహా తక్కిన రోజులంతా నియోజకవర్గాలలోనే ఉండాలని స్పష్టం చేశారు. వారంలో నాలుగు రోజులు నియోజకవర్గంలో పర్యటించాలని, ప్రజలను కలవాలని , వారికి సమస్యలు ఆలకించాలని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వివరించారు.వారి వారి నియోజకవర్గాలలో ఎంపీలు ప్రజా పనుల, సంక్షేమ మీద దృష్టి సారించడమే కాకుండా, పార్టీ వర్గాలను కలుపుకుని కార్యక్రమాలు వేగవంతం చేయాలని, 15 రోజులకు ఒక పర్యాయం తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలు సైతం జరగాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌, ఎంపీలు టీఆర్‌ బాలు, కనిమొళి, తిరుచ్చి శివ, రాజ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సోదరా కదిలిరా నినాదంతో నియోజకవర్గాల వారీగా పార్టీ నిర్వాహకులతో స్టాలిన్‌ సమావేశమయ్యారు. పార్టీ డిప్యూటీ కోశాధికారి , ఎంపీ కనిమొళితో కలిసి పలు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నిర్వాహకులతో వేర్వేరుగా సమావేశమైన స్టాలిన్‌, అక్కడి సమస్యలను అధ్యయనం చేశారు.

ఎంపీలకు ఆదేశాలు..

చైన్నె తేనాం పేటలోని డీఎంకే కార్యాలయంలో పార్టీ పార్లమెంట్‌, రాజ్యసభ సభ్యులతో స్టాలిన్‌ మంగళవారం సమావేశమయ్యారు. ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈసందర్భంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలను గుర్తు చేస్తూ, మీతో స్టాలిన్‌ శిబిరాలను ప్రస్తావించారు. ప్రజల అవసరాలను తీర్చడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ శిబిరాల్లో జిల్లా యంత్రాంగంతో కలిసి ఎంపీలు సైతం భాగస్వాములు కావాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిష్కరించడంలో, కలైంజ్ఞర్‌ మహిళా హక్కు పథం విస్తరణ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలకు అండగా ప్రభుత్వం నిలబడ బట్టే, వారి మద్దతును 2024 లోక్‌ సభ ఎన్నికలలో క్లీన్‌ స్వీప్‌ దిశగా ఇచ్చారని గుర్తు చేశారు. 40కు 40 సీట్లు తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరిలో గె లుచుకుని చారిత్రాత్మక విజయాన్ని ప్రజలకు డీఎంకే కూటమికి అందజేశారని వివరించారు. లోక్‌ సభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు తీవ్రంగా కృషి చేశారని, శ్రమించారని కితాబు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement