అక్రమంగా దుకాణాలను అద్దెకు ఇచ్చిన కౌన్సిలర్లపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా దుకాణాలను అద్దెకు ఇచ్చిన కౌన్సిలర్లపై చర్యలు

Sep 7 2025 7:58 AM | Updated on Sep 7 2025 7:58 AM

అక్రమంగా దుకాణాలను అద్దెకు ఇచ్చిన కౌన్సిలర్లపై చర్యలు

అక్రమంగా దుకాణాలను అద్దెకు ఇచ్చిన కౌన్సిలర్లపై చర్యలు

● వ్యక్తి అరెస్టు

కొరుక్కుపేట: చైన్నెలో వీధి వ్యాపారులను నియంత్రించడానికి చైన్నె కార్పొరేషన్‌ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, పాఠశాలలు, కళాశాలలు, శ్మశానవాటికల సమీపంలో వ్యాపారాలు నిర్వహించడాన్ని నిషేధించారు. ఈ కొత్త నియమాలు తాజాగా అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు చైన్నె అన్నానగర్‌ 2వ అవెన్యూలోని 78 రోడ్డు సైడ్‌ దుకాణాలను తొలగించారు. ఒక వార్డులోని జనాభా శాతాన్ని బట్టి దుకాణాల సంఖ్యను చదరపు మీటరుకు పరిమితం చేశారు. ఆసుపత్రులకు 100 మీటర్ల దూరంలో ప్రధాన పరిపాలనా కేంద్రాలు, రవాణా కేంద్రాల నుంచి 150 కి.మీ దూరంలో కళాశాలలు పనిచేయడానికి అనుమతి లేదు. ఈ కొత్త నిబంధనలను ఉల్లంఘించి వీధుల్లో వ్యాపారాలు ఏర్పాటు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అలాగే అక్రమంగా దుకాణాలను అద్దెకు ఇచ్చిన కౌన్సిలర్లపై చర్యలు తప్పవని స్ప,ష్టం చేశారు.

రూ.7.50 కోట్ల విలువైన

అంబర్‌గ్రీస్‌ సీజ్‌

కొరుక్కుపేట: రూ.7.5 కోట్ల విలువైన అంబర్‌గ్రీస్‌ (తిమింగళం ఉమ్ము)ను అక్రమంగా రవాణా చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దాని విలువ రూ.7.50 కోట్లు అని అంచనా వేశారు. వివరాలు.. వేల్‌ బ్లబ్బర్‌ (అంబర్‌గ్రీస్‌) అనేది తిమింగలాల జీర్ణవ్యవస్థ నుండి ఉత్పత్తి అయ్యే ఒక రకమైన ఘన పదార్థం. ఇది మందులు , ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. కొన్నిసార్లు దీనిని కోట్లాది రూపాయలకు విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో చిదంబరం నగర పోలీస్‌ స్టేషన్‌ కు రహస్యంగా అంబర్‌గ్రీస్‌ అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కారులోని ఓ వ్యక్తిని పట్టుకుని విచారించారు. పోలీసులు కారులో తెల్లటి గుడ్డ సంచిలో అంబర్‌గ్రీస్‌ ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు మైలదుత్తురైకి చెందిన రాజశేఖర్‌ (28)ను అరెసు చేశారు. 7 కిలోల 600 గ్రాముల అంబర్‌గ్రీస్‌ను స్వాధీనం చేసుకున్నారు.

విజయ్‌కు అడ్డంకులు

సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌కు ఆదిలోనే అడ్డంకులు బయలు దేరాయి. ప్రజల్లోకి చొచ్చుకెళ్లే విధంగా ఆయన మీట్‌ ది పీపుల్‌ ప్రజా క్షేత్రయాత్రకు పోలీసులు అనుమతుల వ్యవహారంలో మెళికలు పెట్టే పనిలో పడ్డారు. రెండు మహానాడులను విజయవంతం చేసుకున్న విజయ్‌ తాజాగా ప్రజలలోకి చొచ్చుకెళ్లేందుకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకున్నారు. పది రోజుల పర్యటనగా పలు జిల్లాలను కలుపుతూ మీట్‌ ది పీపుల్‌ కార్యక్రమానికి సన్నద్దమయ్యారు. ఈనెల 13వ తేదీన తిరుచ్చి శ్రీరంగంలో ప్రచార ప్రయాణం మొదలెట్టనున్నారు. అయితే విజయ్‌ రూట్‌ మ్యాప్‌కు సంబంధించిన సమగ్ర వివరాలను తిరుచ్చి పోలీసు యంత్రాంగానికి తమిళగ వెట్రి కళగం వర్గాలు సమర్పించి ఉన్నాయి. అయితే, విజయ్‌ ఓపెన్‌ టాప్‌ వాహనంలో బహిరంగ సభల నిర్వహణకు ఎంపికచేసిన వేదికల వద్ద అనుమతి ఇవ్వబోమని, వేదికలను మార్చుకోవాలని పోలీసులు సూచించడడం గమనార్హం. అలాగే, ఆయన రూట్‌ మ్యాప్‌లో మరిన్ని మార్పుల దిశగా పోలీసులు సూచనలు చేసి ఉండటంతో విజయ్‌ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ నేతకు తరలి వచ్చే జన సమూహంను ముందుగానేఊహించి ఈ మెళికలను పోలీసులు పెడుతున్నారని, యాత్ర అడ్డుకునే వ్యూహంతో ఉన్నట్టుందని మండి పడుతున్నారు.

ఇంటెన్సివ్‌ కేర్‌లోనే నల్లకన్ను

కొరుక్కుపేట: భారత కమ్యూనిస్ట్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు నల్ల కన్ను గత నెల 22వ తేదీన ఇంట్లో పడిపోవడంతో తలకు గాయమైంది. చికిత్స కోసం ఆయనను ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత 24వ తేదీన భోజనం చేస్తున్నప్పుడు ఊపిరి ఆడకపోవడంతో చైన్నెలోని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేరిన నల్ల కన్నుకు వైద్యులు అతని వయస్సుకు తగిన రేటుతో చికిత్స అందించారు. అతనికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ ఉందని వారు చెప్పారు. దానికి చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిందని డాక్టర్‌ చెప్పారు. అయితే, నల్లకన్ను ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లోనే ఉన్నారు. ప్రసుత్తం రెండు వారాలుగా ఆయన చికిత్స పొందుతుండడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను నిశితంగా పరిశీలిస్తున్నారు. నల్లకన్ను పరిస్థితిపై డీన్‌ శాంతరామ్‌ మాట్లాడుతూ నల్లకన్ను వయస్సు 100 ఏళ్లు గడిచిపోయాయని, వృద్ధాప్యం కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ అయ్యాయని, ఇంటెన్సివ్‌ కంటి పరీక్ష చికిత్స ఆధారంగా, అతను ప్రస్తుతం స్పృహలో ఉన్నట్లు తెలిపారు. ఇతర రోగుల మాదిరిగా చికిత్స తర్వాత ఆయన ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తారో చెప్పలేమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement