
టీఎన్ రైజింగ్‌తో రూ. 15,516 కోట్లు పెట్టుబడి
సాక్షి. చైన్నె: టీఎన్ రైజింగ్ పేరిట జర్మనీ, ఇంగ్లాండ్ పర్యటనలలో తమిళనాడుకు రూ. 15,516 కోట్లుపెట్టుబడి వచ్చినట్టు సీఎంస్టాలిన్ ప్రకటించారు. దీని ద్వారా 17,613 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని వివరించారు. గత నెలాఖరు నుంచి సీఎం స్టాలిన్ విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆదివారంతో ఆయన పర్యటననుముగించుకుని సోమవారం చైన్నెకు రాబోతున్నారు. ఈ పరిస్థితులలో తన పర్యటన గురించి , ఇందులో జరిగిన ఒప్పందాలను శనివారం సీఎం స్టాలిన్ ప్రకటించారు. లండనలో ఉత్సాహంగా పర్యటన జరిగిందంటూ హిందూజా గ్రూప్ తమిళనాట విద్యుత్ వాహన, బ్యాటరీ నిల్వ వ్యవస్థల కోసం 7,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. వెయ్యి మందికి దీని ద్వారా ఉపాధి దక్కనున్నట్టు పేర్కొన్నారు. ఆస్ట్రాజెనెకా కంపెనీ విస్తరణకు సంబంధించిన అవగాహన ఒప్పందం జరిగిందన్నారు. ఈ పర్యటనలలో రూ.15,516 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 17,613 ఉపాధి అవకాశాలు దక్కనున్నట్టు పేర్కొన్నారు. ఇవి అవకాశాలు, భవిష్యత్తు కలలకు కార్యాచరణ అని పేర్కొన్నారు.అత్యాధునిక పరిశోధన, ఏఐ–ఆధారిత ఆవిష్కరణలు , సాంకేతికత, ఆరోగ్య సంరక్షణలకు పెట్టుబడులు విస్తృతంగా వస్తున్నట్టు వివరించారు. అలాగే ఏరోస్పేస్‌తో సహా కీలక రంగాలలో అవకాశాలు మెరుగు, డీప్ టెక్, రైల్వేలు, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్‌లో దూసుకెళ్లనున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈప ర్యటనలో భాగంగా శనివారం తత్వ వేత్త కార్ల్ మార్క్స్ స్మారక చిహ్న వద్ద సీఎం స్టాలిన్ నివాళులర్పించారు. తత్వ వేత్త లక్ష్యాలను ఈసందర్భంగా గుర్తుచేశారు.