
గిరివలయం రోడ్డులోని సాధువుల తనిఖీ
వేలూరు: తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయానికి పౌర్ణమితో పాటూ సామాన్య రోజుల్లోనూ భకుత్లు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ క్రమంలో ఆలయం వెనుక వైపున ఉన్న కొండను దైవంగా భావించి గిరివలయం నడిచి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ఈనెల పౌర్ణమి 8వ తేదీ శుక్రవారం ప్రారంభమై శనివా రం సాయంత్రం వరకు ఉంటుంది. సెలవు రోజు కావడంతో ఈనెల గిరివలం నడిచేందుకు భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో కలెక్టర్ తర్పగరాజ్ ఆధ్వర్యంలో ఎస్పీ సుధాకర్, ఆల య జాయింట్ కమిషనర్ భరణీధరణ్ దేవదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి భక్తులకు అవసరమైన ఏర్పాటు చేయాలని తెలిపారు. అదేవిధంగా భక్తులకు అవసరమైన తాగునీరు, పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా తాత్కాలిక బస్టాండ్‌లోనే బస్సులను నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విఽ దంగా గిరివలం రోడ్డులోని సాదువులు గంజాయి, ఇత ర మత్తు పదార్థాలను ఉపయోగించి భక్తులతో ఘర్షణకు దిగుతున్నట్లు పలు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. దీంతో ఎస్పీ సుధాకర్ ఆదేశాల మేరకు ఇద్దరు డీఎస్పీలు, 50 మందికి పైగా పోలీసులు మంగళవారం ఉదయం ఒక్కసారిగా గిరవలం రోడ్డులోని సాధువుల వద్ద తనిఖీలు చేపట్టారు. అదే విధంగా గిరివలయం వచ్చే భక్తుల వద్ద సాధువులు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని అవగాహన కల్పించారు. గిరవలయం రోడ్డులోని మొత్తం 14 కిలో మీటర్ల దూరం ఈ తనిఖీలు చేపట్టడంతో కలకలం రేగింది.