
జియో హాట్‌స్టార్‌లో మరో వెబ్‌సిరీస్
తమిళసినిమా: ప్రధాన ఓటీటీ సంస్థల్లో జియో హాట్‌స్టార్ ఒకటి. ఈ సంస్థ వరుసగా ఒరిజినల్ వెబ్ సిరీస్ రూపొందిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. అలా ఇంతకుముందు జియో హాట్‌స్టార్ సంస్థ రూపొందించిన ఉప్పు పులి కారం, హార్ట్‌బీట్ వంటి వెబ్‌సిరీస్‌లు అత్యంత ప్రేక్షకాదరణను పొందాయి. ప్రస్తుతం పోలీస్ పోలీస్ అని వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో పలువురు ప్రముఖ బుల్లితెర నటీనటులు ముఖ్యపాత్రలు పోషించడం విశేషం. అందులో సర్వం మీనాక్షి సీరియల్ జయశీలన్, కుక్ విత్ కోమలి ఫేమ్ షబానా షాజహాన్, పాండియన్ స్టోర్స్ సీరియల్ ఫేమ్ సుజిత ధనుష్, బిగ్‌బాస్ ఫేమ్ సత్య, విన్సెంట్ రాయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మొరట్టు రాజావు తిరుట్టు మురళియుమ్ అనే ట్యాగ్‌తో కూడిన పోలీస్ పోలీస్ వెబ్ సిరీస్‌ను హై డ్రామా, ఇన్వెస్టిగేషన్, ఎమోషనల్ తో కూడిన కథాంశంతో రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించినట్లు యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. పోలీస్ శాఖ నేపథ్యంలో సాగే పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ వెబ్ సిరీస్ త్వరలోనే హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు.
పోలీస్ పోలీస్
వెబ్‌సిరీస్ చిత్ర
ఫస్ట్‌లుక్ పోస్టర్