క్వారీకి అనుమతి ఇవ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

క్వారీకి అనుమతి ఇవ్వొద్దు

Aug 5 2025 6:24 AM | Updated on Aug 5 2025 6:24 AM

క్వార

క్వారీకి అనుమతి ఇవ్వొద్దు

– రామతండలం గ్రామస్తుల వినతి

తిరువళ్లూరు: వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా ఉన్న చెరువులో పూడికతీత పేరుతో మట్టి తీయడానికి అనుమతి ఇవ్వొద్దని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్‌ రామతండలం గ్రామంలో సుమారు వెయ్యి కుటుంబాలు, మూడువేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇక్కడి ప్రజలకు వ్యవసాయం, పాడి పంటలే ప్రధాన జీవనాధారం. గ్రామంలో సుమారు 71 ఎకరాల విస్తీర్ణంలో చెరువు వుంది. చెరువుపై ఆధారపడి సుమారు మూడు వందల ఎకరాల్లో సాగు ఉంది. అయితే చెరువును పూడికతీత పేరుతో క్వారీ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో క్వారీకి అనుమతి ఇస్తే వ్యవసాయానికి ఇబ్బందులు కలగడంతోపాటు భూగర్భ జలాలు అడుగంటి, తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ, క్వారీకి అనుమతి ఇవ్వొద్దని స్థానికులు కోరుతున్నారు.

స్పృహ తప్పి ప్రభుత్వ

ఉద్యోగికి గాయాలు

తిరువళ్లూరు: విధి నిర్వహణలో నిమగ్నమైన ప్రభుత్వ ఉద్యోగి హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోవడంతో గాయాలైయ్యింది. తిరువళ్లూరు తాలూకా కార్యాలయంలో అఫీస్‌ అసిస్టెంట్‌గా లోకనాథన్‌ విధులు నిర్వహిస్తున్నాడు. యథావిధిగా సోమవారం విధులకు హాజరైన క్రమంలో మధ్యాహ్నం హఠాత్తుగా స్పృహ తప్పి కిందపడ్డాడు. దీంతో అతడికి గాయమైంది. అప్రమత్తమైన సిబ్బంది అతడ్ని వైద్యశాలకు తరలించి, ప్రాథమిక చికిత్సను అందించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

వినాయకుడి గుడిలో చోరీ

కొరుక్కుపేట: తిరుమంగళం పాడికుప్పంలోని వినాయగర్‌ ఆలయంలో నగదు చోరీకి గురైంది. చైన్నె తిరుమంగళం, పడికుప్పంరోడ్డులోని వినాయగర్‌ ఆలయంలోని హుండీ పగిలి, రోడ్డుపై పడి ఉండటాన్ని చూసి ప్రజలు షాక్‌ అయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న ఆలయ నిర్వాహకుడు వివేక్‌ బాబు (36) ఈ విషయమై తిరుమంగళం క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సీసీ కెమెరాల ఆధారంగా నేరస్తుల కోసం గాలిస్తున్నారు.

వ్యాన్‌ను అడ్డగించిన ఏనుగు

తిరువొత్తియూరు: సత్యమంగళం సమీపంలో ఆదివారం ఉదయం ఓ వ్యాన్‌ను ఏనుగు అడ్డగించి, అందులోని టమాటలను తీసుకోవడానికి ప్రయత్నించింది. ఈరోడ్‌ జిల్లా సత్యమంగళం సమీపంలోని కేర్మాళం కొండ ప్రాంతం నుంచి కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం మార్కెట్‌కు టమాట లోడ్‌తో వెళుతున్న వ్యాన్‌ను కేర్మాళం–ఆసనూర్‌ అటవీమార్గంలోని కనక్కరై గ్రామం సమీపంలో ఏనుగు రహదారి మధ్యలో నిలబడి అడ్డగించింది. దీంతో డ్రైవర్‌ భయపడి వ్యానన్‌ను నిలిపివేశాడు. వ్యాన్‌ సమీపంలోకి వచ్చిన ఏనుగు వ్యాన్‌లో ఉన్న టమాట పెట్టెలను తన తొండంతో తీయడానికి ప్రయత్నించింది. డ్రైవర్‌ కొంతసేపు పోరాడి నెమ్మదిగా వ్యానన్‌ను కదిలిస్తూ ఏనుగు నుంచి తప్పించుకున్నాడు.

50 సవర్ల బంగారం,

రూ.50 లక్షల చోరీ

తిరువొత్తియూరు: న్యాయవాది ఇంట్లో 50 సవర్ల బంగారం, రూ.50 లక్షల నగదు చోరీ జరిగింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. విలుప్పురం జిల్లాలోని ఎరిలికుప్పం గ్రామం, మారియమ్మన్‌ గుడి వీధికి చెందిన ఆరుముగం (40) న్యాయవాదిగా పని చేస్తున్నాడు. ఇతను తన తల్లి పార్వతితో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి, తాళం చెవిని ఎప్పటిలాగే ఉంచి, వలర్మతి పనులకు, న్యాయవాది ఆరుముగం న్యాయస్థానానికి వెళ్లాడు. సాయంత్రం అతను ఇంటికి తిరిగి వచ్చి, ఎప్పటిలాగే తాళం చెవిని తీసుకుని తలుపు తెరిచి లోపలికి వెళ్లాడు. ఇంట్లోని బీరువాలో ఉన్న బట్టలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి షాక్‌ అయ్యాడు. బీరువాలో ఉంచిన రూ.50 లక్షల నగుదు, 50 సవర్ల బంగారం చోరీకి గురైనట్లు తెలిసింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.

క్వారీకి అనుమతి ఇవ్వొద్దు 1
1/1

క్వారీకి అనుమతి ఇవ్వొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement