పీఎంకే నేత రామదాస్‌ బయోపిక్‌ | - | Sakshi
Sakshi News home page

పీఎంకే నేత రామదాస్‌ బయోపిక్‌

Jul 26 2025 9:02 AM | Updated on Jul 26 2025 9:34 AM

పీఎంక

పీఎంకే నేత రామదాస్‌ బయోపిక్‌

సోలో లైఫే సో బెటర్‌

తమిళసినిమా: పాట్టాలి మక్కళ్‌ కట్చి(పీఎంకే) పార్టీ తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రామదాస్‌ ఎన్నో పోరాటాలు చేసి పార్టీని ప్రముఖస్థానంలో నిలబెట్టారు. కాగా ఈయన బయోపిక్‌ ఇప్పుడు చలన చిత్రంగా రూపొందుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు సినిమాగా రూపొంది ప్రేక్షకుల ఆదరణను పొందిన విషయం తెలిసిందే. కాగా తాజాగా డాక్టర్‌ రామదాస్‌ బయోపిక్‌ను పలు విజయవంతమైన చిత్రాల దర్శకుడు, నటుడు చేరన్‌ తెరకెక్కిస్తున్నారు. దీనికి అయ్యా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో రామదాస్‌ పాత్రను నటుడు ఆరి పోషిస్తున్నారు. దీన్ని తమిళ్‌కుమరన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తమిళ్‌కుమారన్‌ నిర్మిస్తున్నారు. ఇందులో డాక్టర్‌ రామదాస్‌ జీవితంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన పోరాటాల ఇతివృత్తంతో అయ్యా చిత్రం తెరకెక్కితున్నట్లు సమాచారం. ముఖ్య అంశాలు, ముఖ్యంగా 1980–90 ప్రాంతంలో డాక్టర్‌ రామదాస్‌ పయనాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందని తెలిసింది. ఈ కథను దర్శకుడు చేరన్‌ చాలా కాలంగా రెడీ చేశారు. ఆయన ఇంతకుముందు పలు చిత్రాలు చేసినా బయోపిక్‌ను తెరకెక్కించడం మాత్రం ఇదే తొలిసారి. కాగా పీఎంకే అధినేత డాక్టర్‌ రామదాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు.

తమిళసినిమా: చాలా రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ మోస్ట్‌ వాంటెడ్‌ బ్యాచిలర్స్‌ చాలా మంది ఉన్నారు. నటుల్లోనే కాకుండా నటీమణుల్లోనూ అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారిలో నటి నిత్యామీనన్‌ ఒకరు. ఈ జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత వయసు ఇప్పుడు 37 ఏళ్లు. అంటే మరో మూడేళ్లలో 40ని టచ్‌ చేస్తారన్నమాట. నటిగా తన కంటూ ఒక ప్రత్యేక స్థాఽనానికి చేరుకున్న ఈ మలయాళీ భామ బహుభాషా నటి అన్న విషయం తెలిసిందే. పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతలా ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలరు. అందుకే తిరుచిట్ర ఫలం చిత్రంలో నటనకుగానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. తాజాగా విజయ్‌సేతుపతికి జంటగా నటించిన తలైవన్‌ తలైవి చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన నిత్యామీనన్‌ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలపై మనసు విప్పారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ తన తల్లి పనికి వెళ్లడంతో తాను మూడు నెలల వయసు నుంచే తన బామ్మ వద్ద పెరిగానని చెప్పారు. అలా చిన్న వయసులోనే ఒంటరి తనం అలవాటు అయ్యిందన్నారు. ప్రేమలో పడ్డ ప్రతిసారి అది సంతోషాన్ని కాకుండా బాధాకరమైన అనుభవాన్నే మిగిల్చిందని చెప్పారు. ప్రస్తుతం సినిమా జీవితంపైనే పూర్తిగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. అలాగని జీవితంలో పెళ్లే చేసుకోననే నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆత్మార్థమైన ప్రేమ లభిస్తే అప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, అయితే ప్రస్తుతం తనకు ఈ సోలో లైఫే బెటర్‌గా ఉందని, ఈ జీవితాన్నే ఆస్వాదిస్తూ జీవిస్తున్నానని నిత్యామీనన్‌ పేర్కొన్నారు. కాగా తర్వాత ఈమె ధనుస్‌కు జంటగా నటించిన ఇడ్లీ కడై చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

పీఎంకే నేత రామదాస్‌ బయోపిక్‌ 1
1/1

పీఎంకే నేత రామదాస్‌ బయోపిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement