
వైవిధ్యభరితంగా మారీశన్
తమిళసినిమా: కథలను నమ్మి చిత్రాలను నిర్మించే నిర్మాత ఆర్‌బీ.చౌదరి. ఈయన తన సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన తాజా చిత్రం మారీశన్. ఇది ఈయన నిర్మించిన 98వ చిత్రం కావడం విశేషం. మలయాళ నటుడు ఫాహత్ ఫాజిల్, హాస్య నటుడు వడివేలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కోవైసరళ, వివేక్ ప్రసన్న, సితార, తీనప్పన్, లివింగ్‌స్టన్, రేణుక, శరవణన్ సుబ్బయ్య ముఖ్య పాత్రలు పోషించారు. సుధీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని, కలైసెల్వన్ శివాజీ చాయాగ్రహణంను అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఫాహత్ ఫాజిల్, వడివేలు కలిసి నటించిన ఈ చిత్రం పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందింది. ఫాహత్ ఫాజిత్ జైలు నుంచి వచ్చి మళ్లీ దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తాడు. అలా ఆయన వడివేలు ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు వడివేలు ఏం చేశాడు? అసలు అతను ఎవరు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం మారీశన్. ఫాహత్ ఫాజిల్ ఇందులో పోషించిన పాత్రకు ఆయనే కరెక్ట్ అన్నంతగా నటించారు. చిత్రాన్ని దర్శకుడు చాలా పట్టుగా తెరపై ఆవిష్కరించారనే చెప్పాలి.

వైవిధ్యభరితంగా మారీశన్