
పోటీ కాదు.. సహకార యుగం
– డాక్టర్ నచికేత రౌత్
సాక్షి, చైన్నె : ఇది పోటీ యుగం కాదు, సహకారం యుగం అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీస్ డైరెక్టర్ డాక్టర్ నచికేత రౌత్ వ్యాఖ్యానించారు. ఎస్‌ఆర్‌ఎంఐఎస్‌టీలో బుధవారం ఇండక్షన్ వేడుక జరిగింది. ఇందులో మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ ఫ్యాకల్టీకి ఇన్ కమింగ్ బ్యాచ్‌ను అధికారికంగా ఆహ్వానించారు. హెల్త్ సైన్సెస్ నుంచి 1,500 మంది ఫ్రెషర్లు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో నచికేత రౌత్‌మాట్లాడుతూ, ఇది పోటీ యుగం కాదని , సహకార యుగం అని వ్యాఖ్యలు చేశారు.వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు కలిసి నేర్చుకునే సరస్పర అవగాహన ఈ యుగంలో అవశ్యం అని వివరించారు. ఆధునిక ఆరోగ్య సంరక్షణ వైద్యులు, చికిత్సకులు, ఫార్మసిస్టులు, అనుబంధ నిపుణుల సహకారంతో వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్యనిపుణులను ఆయన సత్కరించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఎంఐఎస్‌టీ వీసీ ముత్తమిళ్ సెల్వన్, అలైడ్ హెల్త్ సైన్సెస్ సలహదారు డాక్టర్ బి రాజశేఖర్,డీన్‌లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.