
రైల్వే ట్రాక్‌లపై నిత్యం నిఘా
– ఐదు సీసీ కెమెరాల ఏర్పాటు
తిరువళ్లూరు: చైన్నె నుంచి మైసూరుకు ఆయిల్‌ను తీసుకెళుతున్న గూడ్స్ రైలు ప్రమాదానికి గురై భారీ నష్టాన్ని ఏర్పరిచిన విషయం తెలిసిందే. ప్రమాదంలో 18 ట్యాంకర్లు పూర్తిగా దగ్ధం కాగా, 8లక్షల 40వేల లీటర్లు ఆయిల్ అగ్నికి ఆహుతి అయ్యింది. ప్రమాదం కారణంగా మూడు రోజులపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను ముమ్మరం చేసి ట్రాక్‌లను సరి చేశారు. ప్రమాదానికి కుట్ర వుందా అనే కోణంలో విచారణ జరిపిన రైల్వే హైలెవల్ కమిటీ, ట్రాక్‌లో ఏర్పడిన పగుళ్లే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఈక్రమంలోనే ట్రాక్‌పై నిత్యం నిఘా వుంచడం, ప్రమాదం జరిగిన ప్రాంతంలో నాలుగు ట్రాక్‌ల వద్ద నాలుగు సీసీ కెమెరాలు, లేన్ మార్పు వద్ద ఒక కెమెరాను నిఘా కోసం ఏర్పాటు చేశారు. సంబంధిత సీసీ కెమెరా ఫుటేజీలను నిత్యం పర్యవేక్షణ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.