
మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాహంతో ముందుకు..
కొరుక్కుపేట: ప్రదాని నరేంద్రమోడీ పిలుపునిచ్చిన మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాహంతో తాము మరింత ముందుకు సాగుతున్నామని బెర్గ్నర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఉమేస్ గుప్తా తెలిపారు. ఈ మేరకు తరపున రీటైల్ సంబంధాలను బలోపేతం చేయడానికి చైన్నె వేదికగా బెర్గ్నర్ ఇండియా తరపున నగరవ్యాప్తంగా కీలక వాణిజ్య భాగస్వాములను ఒకే చోటు తీసుకుని వచ్చి ప్రత్యేక డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రీమియం కుక్ వేర్ అగ్రగామి అయిన బెర్గ్నర్ ఇండియా భారతీయ వంటశాల అవసరాల కోసం అర్జెంట్ క్లాసిక్ ప్రెషర్‌కుక్కర్ సిరీస్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణ భారత వంటకాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రై ఫ్‌లై నాన్ స్టిక్ వంటసామగ్రీని తీసుకుని వచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే కొత్త సిరీస్‌లో లీటరు నుంచి 8 లీటర్లు వరకు పరిమాణాలలో ప్రెషర్ కుక్కర్‌లను తెచ్చామని వెల్లడించారు. నగరంలో చైన్నె పాండిబజార్‌లోని ఏజీఎస్ హబ్ మార్ట్, పార్కుటౌన్‌లోని ఎంఏ యుతిరాజులు నాయుడు స్టోర్‌ల వద్ద ప్రత్యేక బెర్గ్నర్ గ్యాలరీని ప్రారంభించామని పేర్కొన్నారు.