
రుణాల పంపిణీలో అవకతవకలు
తిరుత్తణి: బ్యాంకు రుణాల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్‌లో రైతు సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కణిమొళి ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ స్థాయి అగ్రీ గ్రీవెన్స్ నిర్వహించారు. డివిజన్ వ్యాప్తంగా నుంచి రైతులు పాల్గొన్నారు. రైతులు సమస్యల పరిష్కారం కోసం వినతులు అందజేశారు. సమావేశంలో రైతు సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌రాజు మాట్లాడుతూ నొచ్చిలిలోని ఇండియన్ బ్యాంకులో అర్హులైన రైతులకు, వ్యాపారులకు బ్యాంకు రుణాలు పంపిణీ చేయకుండా కమీషన్ల కోసం బ్యాంకు అధికారులు కుమ్మకై ఇతర ప్రాంతాలకు చెందిన వారికి రూ.7కోట్ల రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. దీంతో బ్యాంకు నష్టాల్లో కూరుకుపోయిందని, రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు నష్టాల్లో వున్నట్లు తెలిపారు. అవకతవకలకు పాల్పడిన బ్యాంకు అధికారులు, ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.