
జాన్ కుమార్‌కు మంత్రి పదవి
● 14న ప్రమాణ స్వీకారం
సాక్షి, చైన్నె: పుదుచ్చేరి ఎన్. రంగస్వామి కెబినెట్‌లోకి కొత్త మంత్రిగా జాన్‌కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే, బీజేపీకి చెందిన మరో ముగ్గురునేతలకు నామినేటెడ్ ఎమ్మెల్యేల పోస్టులు దక్కాయి. వివరాలు.. 2021లో ఎన్‌ఆర్ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలలోకి వెళ్లిన బీజేపీ బ్రహ్మాండ విజయాన్ని దక్కించుకుంది. బీజేపీ – ఎన్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి సీఎంగా ఉన్నారు. అధికారంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉంది. అయితే, గత నెల రోజులుగా పుదుచ్చేరి బీజేపీలో అనూహ్యమార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలోని పార్టీ అధినేతల నుంచి వచ్చిన సమాచారంతో తొలుత ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. క్షణాలలో వీరి రాజీనామాను స్పీకర్ ఎన్బలం సెల్వం ఆమోదించారు. మరుసటి రోజే మంత్రి పదవికి బీజేపీ ఎ మ్మెల్యే సాయి శరవణ కుమార్ రాజీనామా చేశారు. అదే సమయంలో బీజేపీ కొత్త అధ్యక్షుడిగా వీపీ రామలింగం ఎంపికయ్యారు. బీజేపీలో సాగిన పరిణామాలు సీఎం రంగస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి కొత్త సమస్యగా మారింది.
మరో ముగ్గురికి నామినేటెడ్ పోస్టులు
బీజేపీలో ఆది నుంచి అసంతృప్తి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ వచ్చిన జాన్‌కుమార్‌కు ప్రస్తుతం మంత్రి పదవి దక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో పదినెలలు సమయం ఉన్న నేపథ్యంలో తాజాగా జాన్‌కుమార్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. అదే సమయంలో పార్టీకి చెందిన ముగ్గురు నేతలైన దీపయన్, సెల్వం, రాజశేఖర్‌లకు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులు కట్ట టెట్టారు. కేంద్ర హోం శాఖ ఆమోదం నేపథ్యంలో కొత్త మంత్రి, నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఈ నెల 14వ తేదీన రాజ్ నివాస్‌లో ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నట్టు పుదుచ్చేరి నుంచి సమాచారాలు అందుతున్నాయి.