
క్లుప్తంగా
బాధిత కుటుంబాలకు
ఆర్థిక సాయం
● అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశం
కొరుక్కుపేట: తంజావూరు సమీపంలో చెరువులో మునిగి మృతిచెందిన పిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తంజావూరు జిల్లా పూతలూరు తాలూకాలోని మరుదగుడి గ్రామా నికి చెందిన తిరువెంకటయ్యన్ పట్టికి చెందిన జశ్వంత్ (8), మాధవన్ (10) ఈనెల 11వ తేదీ ఉరానికుళం వద్ద ఉన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి మృతిచెందారు. ఈ విషాద వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారని సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. సీఎం జనరల్ రిలీఫ్ ఫండ్ నుంచి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.3లక్షలు అందించాలని సీఎం అధికారు లను ఆదేశించారు.
చైన్నె వీఐటీలో ఫ్రెంచ్ భాష క్లబ్
వేలూరు: చైన్నె వీఐటీ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఎంబీఏ ఫ్రెషర్స్ ఇండక్షన్–2025 కార్యక్రమంలో ఫ్రెంచ్ భాష క్లబ్‌ను ప్రారంభించారు. వీటిలో పుదుచ్చేరి, చైన్నె ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ హిజ్ ఎక్స్‌లెన్సీ మిస్టర్ ఎటియన్ రోలాండ్ పీగ్ హాజరై క్లబ్‌ను ప్రారంభించి ప్రసంగించారు. ఇది పోటీ ప్రపంచమని పోటీ ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చైన్నె వీఐటీ క్యాంపస్‌లో ఫ్రెంచ్ భాష క్లబ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా తమ సంస్కృతిని కాపాడుకుంటూ ఫ్రెంచ్ సంస్కృతిని అనుభవిస్తారని తెలిపారు. వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ మాట్లాడుతూ ఎంబీఏ విద్యార్థులు మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం మాట్లాడుతూ విద్యార్థులు సవాళ్లను ఎదుర్కోవడమే కాకుండా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. వీఐటీ ప్రొ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ త్యాగరాజన్, డాక్టర్ పీకే, అదనపు రిజిస్ట్రార్ మనోహరన్ పాల్గొన్నారు. అలయన్స్ ఫ్రాంకై జ్ ఆఫ్ మద్రాస్, వీఐటీ చైన్నె మధ్య అవగాహన ఒప్పందం చేసుకున్నారు.
హుండీలో చోరీ: వ్యక్తి అరెస్ట్
తిరువొత్తియూరు: తిరువణ్ణామలైలోని అన్నామలైయార్ ఆలయంలోని హుండీలో నగదు చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం అన్నామలైయార్ ఆలయానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి బంగారు ధ్వజస్తంభం వద్ద ఉన్న హుండీ నుంచి నగదు చోరీ చేశాడు. హుండీ నుంచి నగదు చోరీ చేస్తుండగా చూసిన ఆలయ సిబ్బంది, ఆలయ నిర్వాహకులు తిరువణ్ణామలై నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు తిరువణ్ణామలై నగర పోలీసులు, అన్నామలై ఆలయ హుండీ నుంచి రూ.5వేలను చోరీ చేసిన తిరువరూర్ జిల్లాకు చెందిన పళని కుమారుడు శబరినాథన్ (40)ను అరెస్టు చేశారు. అరెస్టు అయిన శబరినాథన్ నుంచి పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు.
పారిశుధ్య కార్మికులకు
యూనిఫాం పంపిణీ
సేలం: ఈరోడ్ కార్పొరేషన్‌లో జోన్–1లోని పారిశుధ్య కార్మికులకు యూనిఫాం పంపిణీ చేశారు. ఈరోడ్ కార్పొరేషన్‌లోని 4 జోన్లలోని మొత్తం 60 వార్డుల్లో ప్రత్యేకంగా మాస్ క్లీనింగ్ జరుగుతోంది. ఇందులో జోన్ 1 పరిధిలోని చిన్నప్ప లేఔట్‌లో శుభ్రపరిచే పని జరిగింది. ఈ పనిని కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ధనలక్ష్మి ప్రారంభించారు. జోన్–1 అధ్యక్షుడు పి.కె.పళనిస్వామి ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొని సామూహికంగా శుభ్రపరచడంలో పాల్గొన్న 50 మంది పారిశుధ్య కార్మికులకు యూనిఫాం అందజేశారు. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పిచ్‌ముత్తు, హెల్త్ ఆఫీసర్ తంగరాజ్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ సతీష్, జూనియర్ ఇంజినీర్లు తిరుమూర్తి, సువరన్‌సింగ్, డీఎంకే కార్యనిర్వాహకులు పాల్గొన్నారు.
బస్సులో
రూ.16.30 లక్షలు స్వాధీనం
● ఒకరి అరెస్ట్
వేలూరు: బస్సులో రూ.16.30లక్షలు తీసుకెళుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుకుడి జిల్లాకు చెందిన 25 సంవత్సరాల మహిళ బెంగళూరులోని ప్రయివేటు కంపెనీలో పనిచేస్తుంది. ఈమె వేలూరులోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువును చూసేందుకు భర్తతో పాటు బెంగళూరు నుంచి ఓ ఏసీ బస్సులో బయలు దేరింది. బస్సు శుక్రవారం అర్ధరాత్రి తిరుపత్తూరు జిల్లా మాదనూరు వద్ద టీతాగేందుకు నిలిపారు. ఆ మహిళ టీ తాగి భర్తతో పాటు బస్సు ఎక్కింది. ఆ సమయంలో బస్సులో ఉన్న ఓ యువకుడు మహిళను సెల్‌ఫోన్‌లో ఫొటో తీశాడు. గమనించిన మహిళ ఆ యువకుడితో గొడవకు దిగింది. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేలూరు నార్త్ పోలీసులు బస్సు వద్దకు చేరు కుని యువకుడిని అరెస్ట్ చేశారు. విచారణలో యువకుడు తూత్తుకుడి జిల్లా కయల్‌పట్టణంకు చెందిన ఇంద్రీస్ అని తెలిసింది. అతని బ్యాగు ను తనఖీ చేయగా అందులో రూ.16.30 లక్షల హవాలా నగదు ఉన్నట్లు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు నగదును కోర్టులో అప్పగించారు.

క్లుప్తంగా