
కొండ ప్రాంత ప్రజల జీవన విధానమే కేవీ
తమిళసినిమా: కొడైకెనాల్‌లోని కొండ వాసీ ప్రజల కష్టాలు, బాధలు వంటి జీవన వినోదాన్ని తెరపై ఆవిష్కరించే కథా చిత్రం ఠెవి అని ఆ చిత్రం దర్శకుడు తెలిపారు. ఆర్ట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫిలిం కంపెనీ పతాకంపై పెరుమాళ్.జీ.జగన్ జయసూర్య నిర్మించిన చిత్రం కేవీ. తమిళ్ దయాళన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆదవన్ కథానాయకుడిగా పరిచయం కాగా నటి శీలా రాజ్ కుమార్ నాయకిగా నటించారు. జాగ్వలిన్, చార్లెస్, వినోద్, చిదంబరం ధర్మదురై జీవా ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వివరాలు తెలుపుతూ మనం సాధారణంగా కొడైకెనాల్ వంటి కొండ ప్రాంతాలకు విహార యాత్రలు చేసి వస్తున్నాయన్నారు. అయితే అక్కడి కొండ వాసీయుల జీవితా, గురించి పట్టించుకోమన్నారు. అలా కొడైకెనాల్ సమీపంలోని కెవి అనే గ్రామంలోని ఆ ప్రకృతితో కలిసి జీవించే చాలా మందికి తెలియని ప్రజల బాధలు, కష్టాలు మొదలగు వారి జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రమే ఇదని చెప్పారు. పుట్టడం ప్రకృతిలో భాగమైతే మనిషి చావడం హింసాత్మకమైయిందన్నారు. ఇకపై ఎవరైనా అలాంటి చావు రాకూడదని, వారు సమాజంలో ఒకరిగా గుర్తించబడాలని చెప్పే చిత్రం కేవీ అని చెప్పారు. అలాంటి ప్రాంతంలో 110 రోజులు చిత్రం షూటింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే ఇది అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని బాలసుబ్రమణియన్.జి, ఎస్.రాజా రవివర్మన్, జగన్ జయసూర్య చాయాగ్రహణం అందించారు.