
గ్రూప్–4 పరీక్షలు ప్రశాంతం
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా జరిగిన గ్రూప్–4 పరీక్షలు పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలో వున్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో గత ఆరు నెలల క్రితం ప్రభుత్వం గ్రూప్–4 నోటిపికేషన్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో జిల్లా నుంచి మొత్తం 38,117 మంది ధరఖాస్తులు చేసుకున్నారు. 99 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పర్యవేక్షించడానికి 126 ఇన్విజిలేటర్లు, 39 తనిఖీ బృందాలు, తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్‌ల నేతృత్వంలో స్పెషల్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతించారు. కాగా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మొత్తానికి 38,117 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, 31,082 మంది హాజరయ్యా రని కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. కై వండూరు, తిరుప్పాచ్చూర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
పకడ్బందీగా గ్రూప్–4 పరీక్షలు
వేలూరు: వేలూరు జిల్లాలో జరిగిన గ్రూప్–4 పరీక్షలు శనివారం పకడ్బందీగా జరిగాయి. 84 పరీక్ష కేంద్రాల్లో 20,110 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వేలూరు జిల్లాలోని ప్రభుత్వ ముస్లిం పాఠశాల, కాట్పాడిలోని వీఐటీ పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలను కలెక్టర్ సుబ్బలక్ష్మి పరిశీలించారు. ఈవేరా పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన 11 మందిని అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లారు.

గ్రూప్–4 పరీక్షలు ప్రశాంతం