
పోలీస్ అధికారి
దర్శకుడు అయిన
తమిళసినిమా: సినిమా చాలా శక్తివంతమైన మాధ్యమం. ఎలాంటి వారినైనా ఆకర్షిస్తుంది. అలా ఇంజినీర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు ఈ రంగంలోకి వచ్చారు. తాజాగా ఒక పోలీసు అధికారి శివరాజ్ దర్శకుడిగా మారారు. ఈయన దర్శకత్వం వహించిన చిత్రం ట్రెండింగ్. రామ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మీనాక్షి ఆనంద్ నిర్మించిన ఈ చిత్రంలో నటుడు కలైయరసన్, నటి ప్రియలయ హీరో హీరోయిన్లుగా నటించారు. నటుడు ప్రేమ్ కుమార్, బెసెంట్ రవి అలెగ్జాండర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యామ్.సిఎస్ సంగీతాన్ని, ప్రవీణ్ బాలు ఛాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు చేస్తున్న ఈ చిత్రం ఈనెల 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బుధవారం సాయంత్రం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత మీనాక్షి ఆనంద్ మాట్లాడుతూ ఇది తమ తొలి ప్రయత్నం అని చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే నిర్మించడానికి సిద్ధమైనట్లు వెల్లడించారు. కలైయరసన్ ప్రతిభావంతుడైన నటుడని, ఆయన దీటుగా నటి ప్రియా లయ నటించారని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు శివరాజ్ మాట్లాడుతూ ఇది ప్రస్తుత సోషల్ మీడియా ముఖాన్ని తెరపై ఆవిష్కరించే కథాచిత్రమని చెప్పారు. ముఖ్యంగా నేటి సమాజానికి చాలా అవసరమైన చిత్రమని పేర్కొన్నారు. దీన్ని తాను చిన్న చిత్రంగా చేయాలి భావించానని, అయితే కలైయరసన్, సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ రావడంతో ట్రెండింగ్ పెద్ద చిత్రంగా మారిందన్నారు. నటుడు కలైయరసన్ మాట్లాడుతూ ఇది తనకు చాలా ముఖ్యమైన చిత్రంగా పేర్కొన్నారు.

పోలీస్ అధికారి