ఐటీ ఉద్యోగుల రక్తదానం | - | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగుల రక్తదానం

Jul 9 2025 7:05 AM | Updated on Jul 9 2025 7:05 AM

ఐటీ ఉ

ఐటీ ఉద్యోగుల రక్తదానం

వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున రోజా, జహీర్‌ హుస్సేన్‌ తదితరులు

ప్రసంగిస్తున్న రోజా, వేదికపై జహీర్‌ హుస్సేన్‌, సునీల్‌ తదితరులు

పేదల కోసం పరితపించిన దివంగత

మహానేత, ఏపీ మాజీ సీఎం

వైఎస్‌ రాజశేఖరరెడ్డికి చైన్నెలో

ఘన నివాళులర్పించారు. మంగళవారం రాజన్న జయంతిని పలుచోట్ల వైఎస్సార్‌ సీపీ సేవాదళ్‌ – తమిళనాడు నేతృత్వంలో

సేవా కార్యక్రమాలతో నిర్వహించారు.

ప్రతి పేదోడి గుండెల్లో కొలువైన మహానేతపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన చిత్ర పటాలకు పుష్పాంజలి

ఘటించారు. వైఎస్సార్‌ అంటే

ఎమోషన్‌...అఫెక్షన్‌ అని ఆంధ్రప్రదేశ్‌

మాజీ మంత్రి ఆర్‌కే రోజా

ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

సాక్షి, చైన్నె: జన హృదయ నేత, నిత్య కృషీవలుడు, అపర భగీరధుడు దివంగత ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 76వ జయంతిని మంగళవారం చైన్నెలో పలు చోట్ల తమిళనాడు వైఎస్సార్‌ సీపీ సేవాదళ్‌ విభాగం అధ్యక్షుడు ఏకే జహీర్‌ హుస్సేన్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఉదయాన్నే పెరంబూరులోని పార్టీ కార్యాలయంలో రాజన్న చిత్ర పటానికి నేతలు నివాళులర్పించారు. ఓఎంఆర్‌ మార్గంలోని ఫాతీమా అనాథ పిల్లల బడిలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రాజన్న కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి పిల్లలతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఉదయం పిల్లలకు, వృద్ధులకు అల్పాహారం అందజేశారు. స్కూల్‌ పిల్లలకు పుస్తకాలు, విద్యా ఉపకరణలు అందజేశారు. మధ్యాహ్నం ఇక్కడి సమీపంలోని మరో ఆశ్రమంలో బిర్యాని పంపిణీ చేశారు. ఏపీ ఐటీ విభాగం అధ్యక్షుడు సునీల్‌, ప్రతినిధులు నిరంజన్‌, మణికంఠ, స్థానిక నాయకులు మాల్యాద్రి రెడ్డి, రామచంద్ర రెడ్డి, వెంకట్‌, రమణయ్య, రవి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం బ్రహ్మాండ వేడుకగా తురై పాక్కంలోని టెక్‌ టవర్‌లో మహానేత జయంతి వేడుక జరిగింది.

పేదవాడి గుండెల్లో దైవం

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌కు నివాళులర్పించిన అనంతరం రోజా మాట్లాడుతూ ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందాలన్న లక్ష్యంతో శ్రమించిన మహామనీషి వైఎస్సార్‌ అని వ్యాఖ్యానించారు. రాముడి పాలన గురించి విన్నాం, రాజన్న పాలనను చూశాం అంటూ, ప్రతి పేదవాడి గుండెల్లో కొలువైన దైవం వైఎస్సార్‌ అని కొనియాడారు. వైఎస్సార్‌ అంటే ఎమోషన్‌ , వైఎస్సార్‌ అంటే అఫెక్షన్‌ అని వ్యాఖ్యానించారు. రైతులకు రుణ మాఫీ, ఉచిత విద్యుత్‌ ఇచ్చి ఆదుకున్నారని, పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న కాంక్షతో ఫీజ్‌ రీఎంబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయన హయాంలోనే లక్షలాది మంది ఇంజినీర్లు అయ్యారని, సుమారు మూడు లక్షల ఐటీ ఉద్యోగాలు దరిచేర్చారని వివరించారు. ఆరోగ్యశ్రీ, 108 ద్వారా పేదవారి ఆరోగ్యాన్ని కాపాడిన దేవుడు ఆయన అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ ఇప్పటికీ కూడా అవి సజీవంగా పేదలకు ఉపయోగపడుతోందన్నారు. పేదవారి కోసం రాజన్న రెండడుగులు ముందుకు వేస్తే, ఆయన వారసుడు జగనన్న నాలుగడుగులు ముందుకి వేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయే పథకాలను ఐదేళ్ల పాటూ అందించారని వివరించారు. ఈవీఎంలలో అవకతవకలు, ప్రలోభాలు, మోసాలతో జగనన్నను ఓడించినా, జనం గుండెల నుంచి మాత్రం జగనన్నను వేరుచేయలేక పోయారని వ్యాఖ్యానించారు. మోసగాడైన చంద్రబాబు, వేషగాడైన పవన్‌ పాలనలో జనం నరకాన్ని అనుభవిస్తున్నారని, త్వరలో వీరి పాలన అంతమై జగనన్న నేతృత్వంలో మళ్ళీ రాజన్న రాజ్యం రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాన్‌ టైం పాస్‌ కోసం రాజకీయాలలోకి వచ్చిన నాయకుడు అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌, ఎంజీర్‌, జయలలితలు సినీ రంగం నుంచే రాజకీయాలలోకి వచ్చారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో న్యాయం చేశారని ఈసందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాజకీయాలలో నమ్మి ఓట్లు వేసిన జనాన్ని మోసం చేయ కూడదని పేర్కొంటూ పవన్‌ ప్రజల్ని విస్మరించి షూటింగ్‌ బిజీలో పడ్డారని విమర్శించారు.

ఇంటింటికీ తీసుకెళ్దాం

ఏపీ ఐటీ విభాగం అధ్యక్షుడు సునీల్‌ మాట్లాడుతూ, బెంగళూరు, హైదరాబాద్‌తో పోటీ పడే విధంగా చైన్నెలో బలం ఉందని అన్నారు. ఐటీ వింగ్‌లోని వారంతా పార్టీ కోసం కష్టపడాలని, శ్రమించాలని పిలుపు నిచ్చారు. ఇప్పటి నుంచి జగనన్న చేసిన మంచి పనులను ప్రజలలోకి విస్తృతంగా, ఇంటింటా తీసుకెళ్లే రీతిలో ప్రతి ఒక్కరూ సైనికుల వలే పనిచేయాలని కోరారు. జగనన్నకు మరింత బలాన్ని ఇచ్చిన ఆర్మీగా మారుదామని రానున్న మూడున్నర సంవత్సరా కాలం ఎల్లో మీడియా ప్రచారాన్ని తిప్పి కొట్టే విధంగా దూసుకెళ్దామని పిలుపు నిచ్చారు.

చైన్నెలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి

చిత్ర పటానికి నేతలు, అభిమానుల ఘన నివాళి

తమిళనాడు సేవాదళ్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

ఐటీ వింగ్‌ రక్తదానం

వైఎస్సార్‌ అంటే ఓ ఎమోషన్‌..అఫెక్షన్‌: మాజీ మంత్రి రోజా

ఇంటింటా జగనన్న చేసిన మంచిని తీసుకెళ్దాం: సునీల్‌

టెక్‌ టవర్‌లో సేవాదళ్‌, ఐటీ వింగ్‌ నేతృత్వంలో జరిగిన బ్రహ్మాండ వేడుకకు ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి రోజా హాజరయ్యారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.రక్తదాన శిబిరాన్ని రోజా ప్రారంభించారు. రక్తదాతలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులు, అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. అనంతరం జహీర్‌ హుస్సేన్‌ అధ్యక్షతన రాజన్నను స్మరిస్తూ కార్యక్రమం జరిగింది. ఇందులో భారీ కేక్‌ను రోజా కట్‌ చేసి అందరికీ పంచి పెట్టారు. రాజన్నకు జోహర్లు అర్పిస్తూ నినాదాలు హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శి సూర్యారెడ్డి, అధికార ప్రతినిధి కృతిక, కార్యదర్శి శివ, నేతలు శరత్‌ కుమార్‌ రెడ్డి, నరేన్‌ రెడ్డి, రెడ్డి శేఖర్‌రెడ్డి , ఉమా రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కేవి కృష్ణారెడ్డి , బాబు, ఐటీ వింగ్‌ ప్రతినిధులు వరుణ్‌, మణి కంఠ,నిరంజన్‌, తదితరులు పాల్గొన్నారు.

ఐటీ ఉద్యోగుల రక్తదానం 
1
1/4

ఐటీ ఉద్యోగుల రక్తదానం

ఐటీ ఉద్యోగుల రక్తదానం 
2
2/4

ఐటీ ఉద్యోగుల రక్తదానం

ఐటీ ఉద్యోగుల రక్తదానం 
3
3/4

ఐటీ ఉద్యోగుల రక్తదానం

ఐటీ ఉద్యోగుల రక్తదానం 
4
4/4

ఐటీ ఉద్యోగుల రక్తదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement