
ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి..!
కీర్తి సురేష్ కొత్త అవతారం?
తమిళసినిమా: పరము, సెల్ఫిష్ చిత్రాల ఫేమ్ మాణిక్ జయ్.ఎన్ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం కై మేర. వచ్చిక్కవా చిత్రంలో హీరోగా నటించిన ఈయన పరము చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తారు. కాగా కై మేర చిత్రం ద్వారా ఎల్‌ఎన్‌టీ ఎతీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. తారై కృష్ణన్, రంజిత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో మరో కీలక పాత్రలో దర్శకుడు మాణిక్ జయ్.ఎన్ నటించారు.నటి సౌమ్య, కష్ణ నందు, జ్ఞానేశ్వరి మొదలగు ముగ్గురు కథానాయికలు నటించారు. దీనికి విఘ్నేశ్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ మనిషి శరీరంలో మృగం సెల్స్ చేరితే జరిగే పరిణామాలే ఏమిటన్న ఇతివృత్తంతో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ కథా చిత్రం ఈ నెల 18న తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్వీ.ఉదయకుమార్, పేరరసు తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను విడుదల చేశారు. ఈ వేదికపై దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఈ చిత్ర కథానాయకుడు తమిళంలో మాట్లాడాలా ఆంగ్లంలో మాట్లాడాలా, కన్నడంలో మాట్లాడితే తప్పు అవుతుందా ? అన్న భావనతో కాస్త తడబడ్డారని, అయితే తమకు భాషతో పనిలేదని,ప్రతిభ ఉంటే చాలని చూస్తామన్నారు. నటుడు రజనీకాంత్ ను ఇక్కడ సూపర్ స్టార్ కొనియాడుతున్నామని, తమిళనాడు నుంచి వెళ్లిన ఒక కథానాయకిని అక్కడ కొనియాడబడుతున్నారా ?అని ప్రశ్నించారు. కాగా తమిళ చిత్రపరిశ్రమలో భాషా భేదం లేదని పేర్కొన్నారు.ఇకపోతే ప్రస్తుతం కోలీవుడ్‌లో మాదక ద్రవ్యాల సంస్కృతి అధికం అవుతోందని, ఈ విషయంలో సినిమా వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. కాగా సస్పెనన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన కై మేర చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు.