
ఎక్సార్చిస్ట్ తరహాలో జన్మనక్షత్రం
తమిళసినిమా: నటుడు తమన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జన్మనక్షత్రం. అమోఘం స్టూడియోస్, వైట్ లాంప్ పిక్చర్స్ సంస్థల కలిసి నిర్మించిన చిత్రం ఇది. మణివర్మన్ దర్శకత్వం వహించిన ఇందులో నటి మల్వీ మల్హోత్రా నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఒరు నొడి వంటి సక్సెస్ ఫుల్ చిత్రం టీమ్ పని చేయడం విశేషం. సంజయ్ మాణిక్ సంగీతాన్ని , కేజీ.మెయ్యప్పన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న తెరపైకి రానుంది. ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను రోమియో పిక్చర్స్ సంస్థ అధినేత రాహుల్ పొందారు. ఈ సందర్భంగా చిత్ర ఆడియో,ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళం ఉదయం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ వహించారు. చిత్ర నిర్మాత విజయ్ మాట్లాడుతూ తాను ఓరున్నది చిత్రాన్ని చూసి చాలా ఇంప్రెస్స్ అయినట్లు పేర్కొన్నారు. దీంతో వేరే రంగంలో రాణిస్తున్న తాను చిత్రం నిర్మాణ సంస్థలు ప్రారంభించి ఒరు నొడి చిత్ర టీం తోనే చిత్రం చేయాలని నిర్ణయించుకున్నన్నట్లు చెప్పారు. కాగా తాను ఊహించిన దానికంటే జన్మ నక్షత్రం చిత్రం బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పారు. చిత్ర కథానాయకుడు తమన్ మాట్లాడుతూ ఇంతకుముందు వచ్చిన హాలీవుడ్ చిత్రాలు ఎక్సార్చిస్ట్ ఒమన్ చిత్రాల తరహాలో ఈ జన్మ నక్షత్రం ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే ఇది ఓమన్ చిత్రానికి రీమేక్ అని చెప్పవచ్చు అన్నారు. ఆరు నొడి చిత్ర కై ్లమాక్స్ ఎలా ఆశ్చర్యం కలిగించిందో, అంతకంటే ఎక్కువగా ఈ చిత్ర కై ్లమాక్స్ అనూహ్య ఘటనలతో ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం కోసం యూనిట్ సభ్యులందరూ ఒక కుటుంబంలా శ్రమించినట్లు పేర్కొన్నారు.

ఎక్సార్చిస్ట్ తరహాలో జన్మనక్షత్రం