
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పళ్లిపట్టు: బైకు ప్రమాదంలో పళ్లిపట్టుకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. పళ్లిపట్టు రాధానగర్‌కు చెందిన వేలు కుమారుడు ముకేష్(22) ఇంజినీరింగ్ చదువుకుని బెంగళూరులోని ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అదే కంపెనీలో విధులు నిర్వహిస్తున్న తేని జిల్లా ఆండిపట్టికి చెందిన విజయ్‌పాండి(25) ఇంట్లో శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముకేష్, విజయ్‌పాండితో కలిసి శనివారం సాయంత్రం బైకులో తేనికి బయల్దేరారు. బైకును ముకేష్ నడిపాడు. హాసూరు వద్ద బైకు వెళ్లుతుండగా జాతీయ రహదారికి మధ్యలో కుక్క రావడంతో బైకు అదుపుతప్పి రోడ్డు బోల్తా కొట్టింది. ప్రమాదంలో పళ్లిపట్టుకు చెందిన ముకేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విజయ్‌కుమార్ తీవ్ర గాయాలతో హాసూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై హాసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిత్రుడితో కలిసి వెళ్లుతున్న సమయంలో బైకు ప్రమాదంలో పళ్లిపట్టుకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
అన్నానగర్: చైన్నె నెర్‌కుండ్రం ప్రాంతానికి చెందిన రాజేశ్వరి. ఇతని భర్త ఆరుముగం, రెండు సంవత్సరాల ముందు మృతి చెందాడు. వీరి కుమారుడు దినేష్ (27), సినిమాలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వీరి కుమార్తె దీపిక(23) ఆమె అంబత్తూరు ప్రాంతంలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఆదివారం ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో నివశించే దీపిక చాలా సేపు బయటకు రాకపోవడంతో ఆమె వెళ్లి గది తలుపు తట్టింది. కానీ తలుపు తెరవకపోవడంతో కిటికీ నుంచి చూడగా, బెడ్‌రూమ్‌లో దీపిక ఉరి వేసుకుని కనిపించింది. పొరుగువారి సహాయంతో వారు తలుపు పగలగొట్టి దీపికను రక్షించి వెంటనే ఆమె మృతదేహాన్ని కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీపిక అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న కోయంబేడు పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. విచారణలో దీపిక ఇంట్లో బాడుగకు నివశించే అరుణ్ ను ప్రేమిస్తున్నానని చెప్పి డబ్బు, నగలు మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీపిక పుట్టినరోజునే మృతి చెందడం గమనార్హం. అజ్ఞాతంలో ఉన్న అరుణ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.