
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ మహోత్సవం
పళ్లిపట్టు: వడకుప్పంలోని ద్రౌపదీదేవి ఆలయ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి అగ్నిగుండ వేడుకలు కోలాహలంగా నిర్వహించగా భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించారు. పళ్లిపట్టు సమీపంలోని వడకుప్పం గ్రామంలో జూన్ 26ప ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకలకు ధ్వజారోహణం నిర్వహించారు. 11 రోజులపాటు నిర్వహించిన వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అగ్నిగుండ వేడుకలు సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుదీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. సాయంత్రం 6 గంటల సమయంలో అగ్నిగుండానికి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేపట్టి అగ్నిగుండం ముందు అలంకరణలో ద్రౌపదీదేవి కొలువుదీరగా, భక్తులు గ్రామ వీధుల్లో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో బాణసంచా సంబరాలు నడుమ భక్తులు గోవింద నామస్మరణతో 200 మందికి పైగా భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించారు.