
ఘనంగా పంచభూత మహాయాగం
నగరి : నగరి మున్సిపాలిటీ పరిధిలోని కేవీపీఆర్ పేట నందనార్ స్వామి ఆలయంలో గురువారం పంచభూత మహాయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే ప్రజా సంక్షేమం కోసం దేశ వ్యాప్తంగా 31 పంచభూత మహాయాగాలను పూర్తి చేశామని నిర్వాహకులు తిరువియార్ రమేష్ స్వామి తెలిపారు. నగరి మున్సిపాలిటీ కేవీపీఆర్‌పేటలో 3 పంచభూత యాగాలు పూర్తి చేశామని తెలిపారు. నాలుగోది 48 రోజుల పాటు పూజలు నిర్వహించామని, గురువారం నిర్వహించిన మహాయాగంతో ముగింపునకు చేరుకుందన్నారు. ప్రజలకు 18 మంది సిద్ధుల ఆశీస్సులతో సంతాన బలం, ఆయురారోగ్యాలు అందాలన్న ఆకాంక్షతోనే ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు మధ్యాహ్నం అన్నదానం చేశారు.