
వైద్యసేవల్లో తమిళనాడు ఆదర్శం
మంత్రి నాజర్
తిరువళ్లూరు: వైద్యసేవల్లో తమిళనాడు దేశానికే తలమానికంగా మారిందని రాష్ట్ర మంత్రి నాజర్ తెలిపారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో 208 నగర సంక్షేమ కేంద్రాలను రూ.5.20 కోట్లు వ్యయంతో నిర్మించారు. పనులు పూర్తయిన క్రమంలో అన్ని కేంద్రాలను ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ క్రమంలోనే తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలోని కోవిల్‌పదాగై ప్రాంతంలో నిర్మించిన కేంద్రాన్ని మంత్రి నాజర్ పరిశీలించి గర్భిణి సీ్త్రలకు కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి నాజర్ మాట్లాడుతూ దేశంలోనే తమిళనాడులోనే ప్రజలకు మెరుగైన చికిత్స అందుతుందని వ్యాఖ్యానించారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఆరోగ్యంతో పాటూ ప్రజాసంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతాప్, మేయర్ ఉధయకుమార్, ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌లు ప్రియారాజ్, డాక్టర్ ప్రభాకరన్‌తో పాటూ పలువురు పాల్గొన్నారు.