
● 19 ఆలయాల్లో రూ.1,770 కోట్లు ● 13 ఆలయాల్లో నిత్య అన్నద
సాక్షి, చైన్నె: భక్తులు, సాధారణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఆలయాల ప్రగతి, నిత్య పూజలు విస్తృతం చేశామని హిందూ మత ధార్మిక దేవదాయశాఖ ప్రగతి నివేదికలో సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. 19 ఆలయాలకు రూ.1,770 కోట్లతో మాస్టర్‌ప్లాన్ అమల్లో ఉన్నట్టు వివరించారు. 2,967 ఆలయాలను పునరుద్ధరించినట్లు తెలిపారు. 1,800 జంటలకు సామూహిక వివాహాలు జరిపించినట్టు, అన్యాక్రాంతమైన రూ.7,671 కోట్ల విలువగల ఆలయ భూములను స్వాధీనం చేసుకున్నామని, 13 ఆలయాల్లో నిత్యాన్నదానం, 18 వేల ఆలయాల్లో ఏక కాల పూజలకు చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. పది వేల గ్రామీణ ఆలయాలకు మరమ్మతులు, ఒకే ఏడాదిలో 274 ఆలయాల్లో పునరుద్ధరణ పనులు జరిగినట్టు పేర్కొన్నారు. రూ.201 కోట్లతో కొండ మీదున్న ఆలయాలకు కేబుల్ కార్, లిఫ్ట్ సౌకర్యాలు కల్పించామన్నారు.
డీఎంకే ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినానంతరం దేవదాయశాఖను హిందూ మత ధార్మిక, దేవదాయ శాఖగా పేరు మార్చేశారు. ఆ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తనకు ఉన్న భక్తిభావంతో నిత్యం ఆలయాల వెంట తిరుగుతూ వాటి అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవల దిశగా ముందుకెళ్తూ వస్తున్నారు. నాలుగేళ్ల పాటు ఈ శాఖలో జరిగిన సమగ్ర వివరాలతో కూడిన నివేదికను శుక్రవారం ప్రకటించారు.
మాస్టర్‌ప్లాన్
రాష్ట్రంలో తిరుచెందూర్, పళని, తిరుత్తణి, సమయపురం, రామేశ్వరంతో పాటు 19 ఆలయాల పునరుద్ధరణ, సమగ్రాభివృద్ధికి కాంక్షించే విధంగా రూ.1,770కోట్లతో మాస్టర్ ప్లాన్ అమల్లో ఉన్నట్టు చెప్పారు. 2,967 ఆలయాల పునరుద్ధరణ పనులు జరిగాయని, మరో 119 ఆలయాల్లో పనులు ముగింపు దశలో ఉన్నట్టు పేర్కొన్నారు. నాగపట్నం తిరుపుగలూరు అరుల్మిగు ఆగ్నేశ్వర స్వామి జూన్ 5న కుంబాభిషేకం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇవేకాకుండా రూ.5,970 కోట్లతో 25,813 ఆలయాల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు. తమిళనాడు ప్రభుత్వ హిందూ మత ధార్మిక శాఖ పనితీరుపై తనకు నమ్మకం ఉన్నట్టు నివేదిక ప్రకటనలో సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. భక్తుల నుంచి విరాళాల ద్వారా రూ.1,350 కోట్లు సేకరించామని, వీటి ద్వారా 10,610 పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 12,104 దేవాలయాల పునరుద్ధరణకు రాష్ట్ర నిపుణుల కమిటీ తాజాగా ఆమోదించిందన్నారు. ఆలయాల తరఫున నాలుగు సంవత్సరాలలో 1,800 జంటలకు వివాహం చేశామని, ప్రతి జంటకు 4గ్రాముల బంగారు తాళి, పట్టుచీర, పట్టు పంచ అందజేశామని వివరించారు. 971 ఆలయాలకు చెందిన రూ.7,671 కోట్ల విలువగల 7,560 ఎకరాల భూమిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
● ఆలయ రికార్డుల సంరక్షణ లక్ష్యంగా ఎల్కాట్ కంపెనీ డాక్యుమెంట్ చేసి భద్రపరిచాం.
● శ్రీరంగం పళని, తిరుచెందూర్, తిరుత్తణి, సమయపురం, మదురై, రామేశ్వరం, తిరువణ్ణామలై, పెరియపాళయం, మేల్‌మలయనూరు, ఆనమలై, కళ్లలగర్, మదురమలైలలో 13 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు చేస్తున్నాం. ఇండియన్ ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ద్వారా 523 ఆలయాలకు నాణ్యతా ధ్రువీకరణ పత్రాలు లభించాయి.
● మానససరోవర్ ముక్తినాథ్ ఆధ్యాత్మిక ప్రయాణం లక్ష్యంగా భక్తులకు ప్రతి ఏటా 60 నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగిన 2 వేల మందిని ప్రభుత్వ సబ్సిడీతో పంపిస్తున్నాం. రామేశ్వరం, ఆరుపడై వీడుల సందర్శన, అమ్మ ఆలయాల ఆధ్యాత్మిక పయనం కాశీ ఆధ్యాత్మికత యాత్ర అంటూ భక్తుల కోసం ప్రత్యేక ఆధ్యాత్మిక పయనం విస్తృతంగా తీసుకెళ్తున్నాం.
● గత ఏడాది పళణిలో అంతర్జాతీయ ముత్తమిళ్ మురుగన్ మహానాడును జయప్రదం చేయడమే కాకుండా, ఆలయాలలో పూజారులు, మహిళా పూజారుల నియామకం నిమిత్తం శిక్షణ కార్యక్రమాలు విస్తృతంచేశాం.
● ఆదాయం లేని 12,959 ఆలయాలకు తలా రూ.లక్ష పెట్టుబడితో పూజకు అయ్యే ఖర్చులకు చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం లక్షను రూ.2.50 లక్షలకు పెంచినట్టు ప్రకటించారు.
● ఏక కాల పూజల పథకం పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న 18 వేల మంది పూజారులను ఎంపిక చేసి ప్రతినెలా రూ.1000 నగదు ప్రోత్సాహం అందిస్తున్నాం. 900 మంది పూజారుల పిల్లల ఉన్నత విద్య కోసం తలా రూ. 10 వేలు అందిస్తున్నారు.
● ఆది ద్రావిడ, గిరిజ ప్రాంతాలలోని 3,750 దేవాలయాలకు తలా రూ. 2 లక్షలతో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో 1,250 ఆలయాలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.2.50 లక్షలు కేటాయించాం.
● రత్నగిరి అయ్యర్ మలై, షోళింగర్ నరసింహస్వామి ఆలయాలకు కేబుల్‌కార్ సేవలు, పళని కొండ, ఇడుంబన్ కొండ మధ్య రూ.90 కోట్లు అంచనాతో, తిరునీర్‌మలై, తిరుకళి కుండ్రం, తిరుప్పరకుండ్రం, కేబుల్ కార్ సేవలకు చర్యలు తీసుకున్నామని వివరించారు. కుంభకోణం సమీపంలోని స్వామిమలైలో లిఫ్ట్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.
● మాతృభాష తమిళంలో పూజలు జరిపే విధంగా చర్యలు తీసుకోవడమే కాదు, వల్లలార్ అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు, అవ్వయ్యార్ కోసం మణిమండపం ఏర్పాటుకు చర్యలు
● ఇరుకన్ కుడి, పెరియపాళయం, సమయపురం, పళణి, తిరువేర్కాడు, మాంగాడు, తిరుచెందూరుసహా 21 ఆలయాలలో భక్తులు కానుకగా సమర్పించిన బంగారం, నాణేలను రిటైర్డ్ న్యాయమూర్తుల పర్యవేక్షణలో కరిగించి, స్వచ్ఛమైన బంగారు కడ్డీలుగా మార్చాం. 1,074 కిలోల బంగారాన్ని పలు జాతీయ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టి ఉన్నాం.
● 25 ఆలయాల్లో రోజంతా ప్రసాదాల పంపిణి, 19 ఆలయాల్లో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆధ్యాత్మిక పుస్తకాలను మళ్లీ ముద్రించి భక్తులకు అందజేస్తున్నాం. ఈ నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం చేస్తున్న ఆధ్యాత్మిక సేవకు తమిళ సంస్కృతి గర్వపడుతోందని, భక్తుల గౌరవాన్ని నిలబెట్టామని, భక్తులు, సాధారణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఆలయాల ప్రగతి పయనం కొనసాగిస్తున్నామని ప్రకటించారు.
సమయపురంలో భక్తుల కోసం నిర్మించిన మండపం

● 19 ఆలయాల్లో రూ.1,770 కోట్లు ● 13 ఆలయాల్లో నిత్య అన్నద

● 19 ఆలయాల్లో రూ.1,770 కోట్లు ● 13 ఆలయాల్లో నిత్య అన్నద

● 19 ఆలయాల్లో రూ.1,770 కోట్లు ● 13 ఆలయాల్లో నిత్య అన్నద

● 19 ఆలయాల్లో రూ.1,770 కోట్లు ● 13 ఆలయాల్లో నిత్య అన్నద