క్లాస్ మేట్‌తో గ్రాండ్ మాస్టర్స్ భాగస్వామ్యం...
సాక్షి, చైన్నె: చెస్ గ్రాండ్ మాస్టర్స్ ప్రజ్ఞానంద, వైశాలితో ప్రముఖ నోట్‌బుక్‌ల తయారీ సంస్థ క్లాస్‌మేట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రతి విద్యార్థిలోనూ పదునైన ఆలోచనను ప్రేరేపించడానికి ఎడ్యుగేమ్ కోసం 30 నగరాల్లో ప్రచారం ప్రారంభించారు. విద్యార్థులు ప్రతిరోజూ ఎడ్యుగేమ్ ద్వారా ఇన్ఫినిటీ ఆడవచ్చని, ఇది ప్రపంచ ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్లతో క్లాస్‌మేట్ నోట్‌బుక్‌ల నుంచి ప్రసిద్ధ చివరి పేజీ పజిల్‌ను కలిగి ఉంటుందని ప్రకటించారు. గురువారం స్థానికంగా జరిగిన ఐటీసీ క్లాస్‌మేట్, విద్యతో ఆటను సజావుగా మిళితం చేసే వినూత్నమైన గేమిఫైడ్ నోట్‌బుక్ అయిన ఎడ్యుగేమ్ ఇన్ఫినిటీని విడుదల చేశారు. గ్రాండ్ మాస్టర్స్ దీనిని ఆవిష్కరించారు. ఇది అభ్యాసాన్ని ఆనందకర అనుభవంగా మార్చే లక్ష్యంతో ఒక ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన చొరవను కలిగి ఉంటుందని, దీని ద్వారా హాంకాంగ్ డిస్నీల్యాండ్‌ను సందర్శించే అవకాశం లభిస్తుందన్నారు. ఇది జీవితకాలంలో ఒకసారి లభించే అవకాశంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్లాస్‌మేట్ నేతృత్వంలో మే 24 నుంచి 30 నగరాల్లో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థులను క్లాస్‌మేట్ నోట్‌బుక్ కొని ఎడ్యుగేమ్స్ ఇన్ఫినిటీ ఆడే రీతిలో ఈ ప్రచారం సాగనుంది.చెస్ గ్రాండ్ మాస్టర్లు, ఆర్ ప్రజ్ఞానంద, ఆర్ వైశాలి 30 రోజుల పాటు ఎడ్యుగేమ్ ఇన్ఫినిటీలో లీనం కానున్నారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్లతో పాటుగా ఐటీసీ విద్య, స్టేషనరీ ఉత్పత్తుల విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ వికాస్ గుప్త, జీఎం అయాన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.


