
చౌక దుకాణం నూతన భవనం ప్రారంభం
పళ్లిపట్టు: పళ్లిపట్టు యూనియన్‌లోని రామసముద్రం గ్రామ పంచాయతీలోని నారాయణపురం గ్రామంలో వందకు పైబడిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామస్తులకు రేషన్ వస్తువులు సరఫరా చేసేందుకు ప్రభుత్వ భవనం లేకపోవడంతో చాలాకాలంగా అద్దె భవనంలో వస్తువులు విక్రయించేవారు. దీంతో కొత్త భవనం నిర్మించాలని ఎమ్మెల్యే చంద్రన్‌కు గ్రామస్తులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే నియోజకవర్గ నిధుల నుంచి రూ. 7 లక్షలు కేటాయించి నూతన భవనం నిర్మించారు. ప్రారంభోత్సవానికి రామసముద్రం ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి గోవిందరాజ్ అధ్యక్షత వహించారు. మండల డీఎంకే కార్యదర్శి జి.రవీంద్ర స్వాగతం పలికారు. ముఖ అతిథిగా తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని నూతన భవనం ప్రారంభించి వినియోగదారులకు రేషన్ వస్తువుల పంపిణీని ప్రారంభించారు.