
అపోలో ఆస్పత్రిలో జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్
సాక్షి, చైన్నె: కీళ్లు సంరక్షణకు చైన్నెలోని అపోలో ఆసుపత్రి మరో అడుగు ముందుకు వేసింది. కొత్తగా అపోలో జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్టు ఆ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోఫెడిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ కన్నన్ తెలిపారు. స్థానికంగా మంగళవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు పురుషుల క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ ఎంఎం సెంథిల్ నాథన్ పాల్గొని చైన్నెలో జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా డాక్టర్ అరుణ్ కన్నన్ మాట్లాడుతూ ఆర్థోపెడిక్ కేర్‌లో గణనీయమైన మార్పును సూచించే సమగ్రమైన జాయింట్ ఫ్రిజర్వేషన్ ప్రోగ్రామ్ అని తెలిపారు. ఈ కార్యక్రమం రోగులు కీళ్ల పనితీరును నిర్వహించడానికి, అనవసరమైన శస్త్రచికిత్సలను నివారించడానికి , చురుకై న జీవితాలను కొనసాగించడానికి సహాయపడడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కీళ్ల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే నాన్–ఇన్వాసివ్ , మినిమల్లీ ఇన్వాసివ్ చికిత్సలను ముందుకు తీసుకెళ్లడానికి వీలు కల్పిస్తుందన్నారు. అనంతరం తమిళనాడు పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ సెంథిల్ నాథన్ మాట్లాడుతూ, క్రికెట్ ఆటగాళ్ల నుంచి వారి దైనందిన జీవితాన్ని గడిపే సాధారణ వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన కీళ్లు చాలా అవసరం అన్నారు. కార్యక్రమంలో చైన్నెలోని అపోలో హాస్పిటల్స్ కిచెందిన సీనియర్ కన్సల్టెంట్లు డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, డాక్టర్ ఎన్. చిదంబరనాథన్, డాక్టర్ నవలాడి శంకర్, డాక్టర్ కె.పి. కోసిగన్ తదితరులు పాల్గొన్నారు.