
వ్యవసాయ కార్మిక విభాగం కన్వీనర్ నియామకం
పళ్లిపట్టు: పళ్లిపట్టు నార్త్ మండల డీఎంకే వ్యవసాయ కార్మిక విభాగం కన్వీనర్‌గా మాధవన్ నియమితులయ్యారు. ఇతను మండల కార్యదర్శి న్యాయవాది సీజే.శ్రీనివాసన్ సమక్షంలో తిరుత్తణిలోని పార్టీ జిల్లా కార్యదర్శి కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే చంద్రన్‌ను కలిసి ఆశీస్సులు పొందారు. కొత్తగా నియమితులైన మాధవన్‌కు జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే చంద్రన్ శుభాకాంక్షలు తెలిపి పార్టీ పటిష్టతకు కృషిచేయాలని సూచించారు. ఈసందర్భంగా మాధవన్ ఎమ్మెను సత్కరించారు. పార్టీ మండల యువజన విభాగ ఉప కార్యదర్శి చంద్రు, విద్యార్థి విభాగ ఉపకార్యదర్శి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.