
దుకాణాలకు 24 గంటల అనుమతి
సాక్షి, చైన్నె: గత వారం జరిగిన వర్తక దినోత్సవం సందర్భంగా వ్యాపారుల విజ్ఞప్తిని పరిశీలించిన సీఎం స్టాలిన్ శుక్రవారం అమల్లోకి తీసుకొచ్చారు. దుకాణాలు, కొన్ని వ్యాపా రాలకు సంబంధించిన సంస్థలు వారానికి 7 రోజులు అంటూ రోజుకు 24 గంటలు తెరిచి ఉండడానికి అవకాశం అన్నది ఉన్నా, అధికారిక ఉత్తర్వులు తప్పనిసరి. మూడేళ్ల క్రితం జారీ చేసిన ఉత్తర్వులు జూన్ 4వ తేదీతో ముగి యనుంది. దీంతో వ్యాపారులు పెట్టుకున్న విజ్ఞప్తిని పరిశీలించి ప్రజాప్రయోజనాల దృష్ట్యా, 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులతో కూడిన దుకాణాలు, వ్యాపార సంస్థలు 24 గంటల పాటు తెరచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రిప్లికేన్‌లో డిప్యూటీ సీఎం
సాక్షి, చైన్నె: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శుక్రవారం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చేపాక్కం–ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజీ అయ్యారు. ఇక్కడ చేపట్టిన వివిధ పనులను ప్రారంభించారు. రూ.15.61 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, రూ.5.87 కోట్లతో నిర్మించిన గ్రంథాలయాలు, ఆలయాలలో భక్తుల కోసం వివిధ వసతులు ఇందులో ఉన్నాయి. రాయపేటలో నిర్మించిన గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. 224 సీట్లతో కూడిన వివాహం, సమావేశాల ఇతర వాటి నిర్వహణ కోసం బహుళ ఉపయోగంతో కూడిన భవనాన్ని, పార్థసారథి ఆలయ స్థలంలో రూ.77.50 లక్షలతో నిర్మించిన భవనాన్ని, మహాకవి భారతియార్ ఇంటి వద్ద రూ.3.22కోట్లతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి శేఖర్‌బాబు, మేయర్ ప్రియ, ఎంపీ దయానిధి మారన్ పాల్గొన్నారు.
నైపుణ్యాలను
మెరుగుపరుచుకోవాలి
● విద్యార్థులకు పి.చిదంబరం సూచన
● గ్రేట్ లేక్స్‌లో పీజీపీఎం–2026
సాక్షి, చైన్నె: నైపుణ్యాలను మెరుగుపరుచుకునే విధంగా విద్యార్థులు ముందుకు సాగాలని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం పిలుపునిచ్చారు. గ్రేట్ లెక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్‌లో పీజీపీఎం–2026 కార్యక్రమం శుక్రవారం జరిగింది. రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థితిస్థాపకత, సేవా విలువలను వివరించారు. వ్యక్తులు, సంస్థలు మార్పును స్వీకరించాలని, సమాజం విస్తృత శ్రేయస్సు, లక్ష్యాలను సమలేఖనం చేయాలని కోరారు. మార్పునకు సిద్ధంగా ఉండండి, అది జరుగుతుంది. మార్పును అంగీకరించవచ్చు, స్వీకరించవచ్చు, నైపుణ్యం పెంచుకోవచ్చు అని వివరించారు. గ్రేట్ లేక్స్ డైరెక్టర్ డాక్టర్ దేబాషిష్ సన్యాల్ మాట్లాడుతూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు.
ఐఐటీలో కొత్త కోర్సు
కొరుక్కుపేట: తయారీ, మైనింగ్, సంబంధిత రంగాల్లో ప్రమాదాలను తగ్గించడానికి ఐఐటీ–మద్రాసు ఒక కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. సెంటర్ ఫర్ అవుట్ రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ మూలంగా ఆన్‌లైన్ కోర్సుగా పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమో ప్రోగామ్‌గా తీసుకొస్తున్నారు. ఆసక్తిగల విద్యార్థులు మే 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చునని, దీనికి ప్రవేశ పరీక్షను జూలై 13న నిర్వహించనున్నట్టు ఐఐటీ మద్రాసు పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమో కోర్సు కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ రాజగోపాలన్ శ్రీనివాసన్ తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు htt p://code.iitm.ac.in/psocerrrafety లింక్‌ను చూడవచ్చునని తెలిపారు.
బీజేపీ కౌన్సిలర్‌పై ఫిర్యాదు
కొరుక్కుపేట: చైన్నె వెస్ట్ మాంబలం పోస్టల్ కాలనీ మూడవ వీధిలో కన్నన్ దేవాలయం ఉంది. హిందూ మత ధర్మదాయశాఖ ద్వారా ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఆలయ కూల్చివేత పనులను గురువారం ప్రారంభించారు. దీనిని పర్యవేక్షించేందుకు ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భారతీరాజా, అఽధికారులు, సిబ్బంది వెళ్లారు. అనంతరం 134వ వార్డు కౌన్సిలర్ బీజేపీకి చెందిన ఉమ తన మద్దతుదారులతో అక్కడికి వెళ్లారు. వారు సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ ధర్మదాయశాఖ అధికారులతో ఆమె వాగ్వాదానికి దిగారు. దీంతో ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భారతీరాజా అశోక్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో కౌన్సిలర్ ఉమ, మరో 10మంది మద్దతుదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తెలియజేశారు.

దుకాణాలకు 24 గంటల అనుమతి