తిరువళ్లూరు: పూందమల్లి సమీపంలోని గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోట్ల రూపాయలు విలువ చేసే వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సర్వీసు రోడ్డులో ఫ్రిడ్జ్‌లు, కూలర్ల గోడౌన్ ఉంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి పది గంటలకు ఉద్యోగులు తమ విధులను ముగించుకుని ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం గోడౌన్ నుంచి పొగలు వచ్చి క్షణాల్లో వెంటనే మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో అందులో ఉన్న కూలర్లు, ఫ్రిడ్జ్‌లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. విషయం తెలిసి సంఘటన స్థలానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. గోడౌన్ రూ.2కోట్ల విలువ చేసే వస్తువులు ఉన్నట్లు బాధితుడు తెలిపారు.