సాక్షి,చైన్నె: డ్రీమ్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ 15వ టేబుల్ టెన్నిస్ పోటీల్లో దివ్యాన్షి, అనన్య, సైన్ తమ ప్రతిభను చాటారు. చైన్నెలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో డ్రీమ్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ టేబుల్ టెన్నిస్ పోటీలు ఉత్తేజకరంగా కొనసాగాయి. బాలురు, బాలికల విభాగాల్లో గ్రూప్ మ్యాచ్‌లలో అద్భుత ప్రతిభను క్రీడాకారులు ప్రదర్శించారు. బాలికల విభాగంలో భౌమిక్ దివ్యాన్షి గ్రూప్ ఏ–1లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఆమె తన ప్రత్యర్థులందరిపై 3–0 తేడాతో విజ యం సాధించారు. మురళీధరన్ అనన్య గ్రూప్‌ఏ–2లో ఆధిపత్యం చెలాయించారు. గ్రూప్–4లో శ్రేయ అసాధారణ ఫామ్‌ను ప్రదర్శించారు. ఒక్క సెట్‌ను కోల్పోకుండా తన అన్ని మ్యాచ్‌లను గెలుచుకున్నారు. బాలుర జట్టులో రిత్విక్ గుప్తా, సాహి ల్ రావత్ ఆధిపత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు, వారి గ్రూప్ మ్యాచ్‌లను 3–0 విజయాలతో కై వసం చేసుకున్నారు. నవరంగ్ అధర్వ, సురపురెడ్డి త్రిషల్ రాజ్‌కుమార్ కూడా వారి మ్యాచ్‌లలో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వోహ్రా త్రిజల్, భివాండ్కర్ పరమ్ మధ్య జరిగిన ఐదు సెట్ల పోరాటం (9–11, 11–5, 7–11, 16–14, 12–14) అద్భుత క్రీడకు నిదర్శనంగా నిలిచింది. ఈ టోర్నమెంట్ రెండు విభాగాల్లోనూ ఆశాజనకంగా యువ ప్రతిభను హైలెట్ చేశారు. కిన్లే జియా, రే అహోనా, పాల్ దివిజా, దాస్ అన్వేష వంటి ఆటగాళ్లు కూడా బలమైన ప్రదర్శన ఇచ్చారు. శనివారం సాయంత్రం జరిగే ఫైనల్స్‌తో చాంపియన్స్‌కు క్రీడల శాఖకార్యదర్శి అతుల్యమిశ్రా, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జే మేఘనాథరెడ్డి, క్రీడాకారులు శరత్‌కమల్ బహుమతులను ప్రదానం చేయనున్నారు.
సత్తా చాటిన క్రీడాకారులు