వేలూరు: టైలరింగ్ వృత్తిపై పన్నుల భారం మోపవద్దని మహిళలు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. సోమవారం ఉదయం కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన గ్రీవెన్‌సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. వినతులను స్వీకరించిన కలెక్టర్ ఆయా శాఖల ఉన్నతాధికారులకు సిఫారసు చేసి, వెంటనే వీటిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా తమిళనాడు కుట్టు మిషన్ల సంక్షేమ శాఖ సంఘం సభ్యులు అందజేసిన వినతిలో తమపై పన్నుభారం మోపవద్దని కోరారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలో అద్దె భవనాల్లో టైలరింగ్ దుకాణం నడుపడంతోపాటు అందులోనే తాము కుట్టిన దుస్తులను అక్కడే ఉంచి రెడిమేడ్ వ్యాపారం చేస్తున్నామని, అయితే కార్పొరేషన్ అఽధికారులు తమపై పన్నులు విధించి తప్పనిసరిగా చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారని వారిచ్చిన వినతి పేర్కొన్నారు. తమకు వచ్చే ఆదాయమే అరకొరాగా ఉందని, దాంతో కుటుంబాలను కూడా పోషించలేక తీవ్ర ఇబ్బందులు పుడుతున్నామని వాపోయారు. వీటిపై విచారణ జరి పి తమకు పన్నులు విధించకుండా చూడాలన్నారు. వినతిని స్వీకరించిన కలెక్టర్ వీటిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వివి ధ శాఖల ద్వారా సంక్షేమ పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ మాలతి పాల్గొన్నారు.