సాక్షి, చైన్నె: ఇండియన్ ఇనన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్)లో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్(సీఎఫ్‌ఐ) ఓపెన్ హౌస్ – 2025 కార్యక్రమం శనివారం జరిగింది. ఇందులో 26 జట్లకు చెందిన సుమారు 1,000 మంది విద్యార్థుల ఆవిష్కరణలు కొలువయ్యాయి. 60 అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించారు. దేశంలో విద్యార్థులచే నిర్వహించబడే అతిపెద్ద ఇన్నోవేషన్ ల్యాబ్‌లలో ఒకటిగా సీఎఫ్‌ఐ పేరు గడించింది. ఇందులో విభిన్న సాంకేతిక డొమైన్‌లలో విస్తరించి 14 క్లబ్‌లు ఉన్నాయి, అలాగే జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్‌లలో చురుకుగా పోటీపడే ఎనిమిది పోటీ జట్లు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఏటా నిర్వహించబడే ఓపెన్ హౌస్‌లో పూర్తిగా విద్యార్థులే రూపొందించి నిర్మించిన ఉత్పత్తులు కొలువు దీర్చడం జరుగుతోంది. ఇందులో ప్రాజెక్టులు, పరిశ్రమ, పూర్వ విద్యార్థుల నుంచి మరింత మద్దతును ఆకర్షించడానికి ఒక ప్రత్యేకమైన వేదికను ఈ ఓపెన్ హౌస్ అందిస్తోంది. శనివారం జరిగిన ఓపెన్ హౌస్ 2025 అనేక అద్భుతమైన ప్రదర్శనలకు సాక్ష్యంగా నిలిచింది,
ఆవిష్కరణలు..
హర్యానాలోని సోనిపట్‌లోని జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలోని భారతదేశపు మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియంలో సందర్శకులకు సహాయం చేయడానికి రూపొందించబడిన ఏఐ–ఆధారిత హ్యూమనాయిడ్ సంవిద్, ఓ సూపర్‌సిరింజ్, ఖచ్చితమైన అనస్థీషియా మోతాదును నిర్ధారించే వాల్యూమ్–గేటెడ్ సిరంజి. ఓ డ్రోన్ స్వార్మ్, పేలోడ్ లిఫ్టింగ్, డెలివరీ కోసం రూపొందించబడిన డ్రోన్ల సమన్వయ సముదాయం కూడా ఉన్నాయి. ఈ ఆవిష్కరణలను మార్కెట్‌కు తీసుకెళ్లడంలో సహాయం చేయాలని పరిశ్రమ, పూర్వ విద్యార్థుల సంఘానికి పిలుపునిస్తూ, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి ఈ ఓపెన్ హౌస్‌వేదికగా పిలుపు నిచ్చారు. విద్యార్థి సమాజంలో నిర్మాణ సంస్కృతిని ఈ కార్యక్రమం పెంపొందించిందన్నారు. తమ అండర్ గ్రాడ్యుయేట్లలో ఎక్కువ మంది సీఎఫ్‌ఐ అనుబంధ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని వివరించారు. ఈ సంవత్సరం ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ పోటీలలో ఈ బృందాలు అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడంతో పాటూ కొన్ని అసాధారణమైన ఆవిష్కరణలను ప్రదర్శించడం జరిగిందన్నారు. అలాగే ప్రీ–ఇంక్యుబేటర్ నిర్మాణ్‌ను చేరుకుంటున్నాయని ప్రకటించడం గర్వకారణంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థి సార్థక్ సౌరవ్ గ్రాాడ్యుయేషన్ తర్వాత వెంటనే తన సొంత స్టార్టప్ (మాటరైజ్)ను స్థాపించి చేరడం ఇదే మొదటిసారి పేర్కొన్నారు. ఇంత అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శించినందుకు జట్లు, విద్యార్థి కార్యనిర్వాహకులు, అధ్యాపక మార్గదర్శకులు మరియు సహాయక సిబ్బందిని అభినందించారు. అలాగే స్టార్టప్ శతం మిషన్‌ను కొనసాగించడానికి మరింత బలంగా సహకరించడానికి వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఐఐటీ మద్రాస్ డీన్ (విద్యార్థులు) ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి మాట్లాడుతూ, సీఎఫ్‌ఐ అనేది ఆవిష్కరణ సృజనాత్మకతకు ఒక వెలుగు అని వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం ఓపెన్ హౌస్‌లో 1,000 మంది విద్యార్థులతో కూడిన 60కి పైగా ప్రాజెక్టులు తమ వద్ద ఉన్నట్టు వివరించారు. ఈ ఆవిష్కరణల ఆధారంగా 15 పేటెంట్లను దాఖలు చేశామన్నారు. అలాగే మూడు సంభావ్య స్టార్టప్‌ల కోసం అన్వేషిస్తున్నామన్నారు. ఈ ప్రయాణంలో ఐఐటీ మద్రాస్ త్వరలో లక్ష్యాన్ని సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు.
ముఖ్యాంశాలు..
ఈ పదర్శనలో సాప్ట్‌వేర్, ఏఐ రంగంలో దృష్టి లోపం ఉన్న వారికి యాక్సెసిబిలిటీని పెంచే ఆడియో – ఆధారిత వీఆర్ గేమ్ బ్లింక్, విభిజన్న శైలులను మిళితం చేసే మల్టీ –ట్రాక్ ఫ్యూజన్ మ్యూజిక్ జనరేటర్ ఏఐఐ రెహమాన్ వంటి ప్రాజెక్టులు లీనమయ్యే సాంకేతికతను ఈ ప్రదర్శన ద్వారా ముందుకు తెచ్చాయి. నాణ్యతను కొనసాగిస్తూ ఫైల్ పరిమాణాలను ఆప్టిమైజ్ చేసే అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్ సాధనం యాక్సిఫై, భవిష్యత్తు–ప్రూఫ్ భద్రతను నిర్ధారించే పోస్ట్–క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ లైబ్రరీ క్వాన్ క్రిప్ట్, గణన సామర్థ్యం, సైబర్ భద్రతలో ఆవిష్కరణలను ప్రదర్శించారు. ట్రేడ్‌క్రాఫ్ట్, ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్, వినియోగదారులు స్టాక్, ఫ్యూచర్స్ , ఆప్షన్స్ ట్రేడింగ్‌ను రిస్క్–ఫ్రీ వాతావరణంలో అనుకరించడానికి అనుమతి ఇచ్చారు. ఫార్ములా స్టూడెంట్ ఈవీ రేస్ కార్ టీమ్ రఫ్తార్, ఫార్ములా భారత్ – 2025లో ఓవరాల్ స్టాటిక్స్‌లో మొదటి స్థానాన్ని కై వసం చేసుకోవడం విశేషం. ఇంజినీరింగ్ డిజైన్, ఖర్చు, తయారీ చ ఉత్తమ బ్యాటరీ ప్యాక్‌లలో అత్యున్నత అంశాలు ఉన్నాయి. హైపర్‌లూప్ కోసం సబ్–స్కేల్ ప్యాసింజర్ క్యాబిన్ , మార్గదర్శక బూస్టర్–క్రూయిజర్ టెక్నాలజీని అభివృద్ధి తో పాటుగా స్టీల్ ట్యూబ్‌లను ఖర్చుతో కూడుకున్న కాంక్రీట్ ట్యూబ్‌లతో భర్తీ చేస్తూ మౌలిక సదుపాయాలను మరింత స్కేలబుల్‌గా తీర్చిదిద్దారు. వారి టెస్ట్ ట్రాక్ ఏరోడైనమిక్స్, లెవిటేషన్, ప్రొపల్షన్ , భద్రతా వ్యవస్థల వాస్తవ–ప్రపంచ ధ్రువీకరణకు ఇందులో అనుమతి ఇచ్చారు.
ఆవిష్కరణల కొలువు
60 టెక్ ఇన్నోవేషన్ల ప్రదర్శన