వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని వల్లిమలై సుబ్రహ్మణ్యస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మురుగ పెరుమాల్ తిరు కల్యా
ణోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా స్వామి, అమ్మవార్లుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు, దీపారాధనలు చేసి తిరుకల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. ఆర్యవైశ్య వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. అమ్మవారికి వరుస తాంబూలం అందజేశారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ధనశేఖర్ శెట్టియార్, కార్యదర్శి ఆనందన్, కోశాధికారి కుప్పురాజ్, పీఆర్‌ఓ సుబ్రమణ్యశెట్టియార్, జాయింట్ కార్యదర్శి భాస్కరన్, వాసుదేవన్ పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ చైర్మన్ సారథి పాల్గొన్నారు.
కమనీయం.. తిరుకల్యాణోత్సవం