కొరుక్కుపేట: ఉమెనన్స్ వాలంటరీ సర్వీస్ ఆఫ్ తమిళనాడు (డబ్ల్యూవీఎస్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. దీనికి చైన్నె చేట్ పేట మేయర్ వీఆర్ రామనాథన్ రోడ్ లోని వాలంటరీ సర్వీస్ కేంద్రంలో జరిగిన ఈ వేడుకలకు ఉమెనన్స్ వాలంటరీ సర్వీస్ ఆఫ్ తమిళనాడు అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ యశోద షణ్ముఖ సుందరం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ రేణుకా మోహన్ రావు పాల్గొని మహిళాదినోత్సవం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్, చేనేత ప్రదర్శనలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఉమెనన్స్ వాలంటరీ సర్వీస్ ఆఫ్ తమిళనాడు చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ అచీవర్ అవార్థులతో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాజాయింట్ డైరెక్టర్ (రిటైర్డ్), శాస్త్రవేత్త డాక్టర్.కె.రెమా దేవి, చోళమండలం ఆర్టిస్ట్ జి.లతా గోపాల్ లను ఘనంగా సత్కరించారు. ఇటీవల సీఎం స్టాలిన్ చేతులమీదుగా అవ్వయార్ అవార్డ్ అందుకున్న ప్రొఫెసర్ డాక్టర్ యశోద షణ్ముఖ సుందరం అవార్డు కింద అందుకున్న రూ.1,50,000 మొత్తాన్ని ఉమెనన్స్ వాలంటరీ సర్వీస్ ఆఫ్ తమిళనాడుకి విరాళంగా అందించారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ ఊర్మిళ, కోశాధికారి శ్రీలక్ష్మీ మోహనరావు , ఉపాధ్యక్షులు సరోజిని , సభ్యులు డాక్టర్ ఎం భానుప్రియా తదితరులు పాల్గొన్నారు.పలు సందేశాత్మక పెంయింటింగ్ ఆకట్టుకున్నాయి.