
వేలూరు కొత్త బస్టాండ్‌లో నిలిచిన ఆర్టీసీ బస్సులు
వేలూరు: కావేరి సమస్య కారణంగా కర్ణాటక రాష్ట్రంలో మంగళవారం బంద్ ప్రకటించారు. దీంతో తమిళనాడు నుంచి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, కోలార్, కేజీఎఫ్ వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సులు పూర్తిగా తమిళనాడు సరిహద్దు ప్రాంతం వరకు వెళ్లి వేలూరు బస్టాండ్‌కు చేరింది. మరికొన్ని బస్సులు వేలూరు కొత్త బస్టాండ్‌లోనే నిలిచిపోయాయి. చైన్నె, కోవై వంటి ప్రాంతాల నుంచి వేలూరు మీదుగా బెంగళూరు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అదే విధంగా వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట వంటి జిల్లాల నుంచి బెంగళూరు వెళ్లే మొత్తం 44 ప్రభుత్వ బస్సులు తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన హోసూరు వరకే నడిచాయి.